OTT Movie : ఈరోజుల్లో డేటింగ్ యాప్ లతో యువత చాలా సమయం గడుపుతున్నారు. కొత్త పరిచయాల కోసం తహతహ లాడుతున్నారు. అయితే పరిచయాలు కొన్ని బాగానే ఉన్నా, కొన్ని సమస్యలు తెస్తుంటాయి. ఇక ఈ సినిమా స్టోరీలో కూడా ఒక అమ్మాయి, తన అభిరుచికి తగ్గ అబ్బాయికోసం వెతుకుతుంది. కానీ అందరూ మోసగాళ్లుగానే ఆమెకు అనిపిస్తుంటారు. ఈక్రమంలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఓక మరచిపోలేని థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమా ఇస్తుంది. ఈ మూవీ పేరు ? ఇందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
జియో హాట్ స్టార్ లో
‘ఫ్రెష్’ (Fresh) 2022లో విడుదలైన అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. మిమి కేవ్ తొలి దర్శకత్వంలో లారిన్ కాన్ స్క్రీన్‌ప్లే ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో డైసీ ఎడ్గర్-జోన్స్ (నోవా), సెబాస్టియన్ స్టాన్ (స్టీవ్), జోజో టి. గిబ్స్ (మొల్లీ), ఆండ్రియా బాంగ్ (పెన్నీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది హులు, జియో హాట్ స్టార్ లలో 2022 మార్చి 4న విడుదలైంది. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2022 జనవరి 20న ప్రీమియర్ అయింది. ఈ సినిమా ఆధునిక డేటింగ్, కానిబాలిజం అనే డార్క్ థీమ్‌తో ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 1 గంట 54 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
పోర్ట్‌ల్యాండ్‌లో నివసించే నోవా అనే యువతి ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లతో విసిగిపోయి ఉంటుంది. ఆమెకు ఈ యాప్‌లలో ఉండే మనుషులు మంచివాళ్ళుగా అనిపించారు. ఆమె సరైన తోడు కోసం ఎదురుచూస్తుంటుంది. ఒక రోజు ఒక సూపర్‌మార్కెట్‌లో, ఆమె స్టీవ్ అనే ఆకర్షణీయమైన, సరదాగా ఉండే వ్యక్తిని కలుస్తుంది. స్టీవ్ ఆమెతో ఫ్లర్ట్ చేసి, ఆమె నంబర్ తీసుకుంటాడు. ఆన్‌లైన్ డేటింగ్‌కు భిన్నంగా, ఈ రియల్-లైఫ్ మీట్-క్యూట్ నోవాకు ఆశాజనకంగా అనిపిస్తుంది. వారి మొదటి డేట్ అద్భుతంగా సాగుతుంది. స్టీవ్ ఆకర్షణీయమైన ప్రవర్తన నోవాను పూర్తిగా కట్టిపడేస్తుంది.
కొన్ని డేట్స్ తర్వాత, స్టీవ్ నోవాను ఒక రొమాంటిక్ వీకెండ్ గెట్‌అవేకు ఆహ్వానిస్తాడు. ఎక్కడికి అనేది రహస్యంగా ఉంచుతాడు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ మొల్లీ సలహా మేరకు కాస్త సంశయించినా, నోవా స్టీవ్‌తో వెళ్లడానికి అంగీకరిస్తుంది. వారు స్టీవ్ లగ్జరీ హోమ్‌లో ఒక రాత్రి గడుపుతారు. కానీ స్టీవ్ ఆమె డ్రింక్‌లో డ్రగ్ కలపడం వల్ల, నోవా స్పృహ కోల్పోతుంది. ఆమె మేల్కొన్నప్పుడు, తనను తాడుతో కట్టేసి, ఒక గదిలో బంధించి ఉన్నట్లు తెలుసుకుంటుంది.
ఇక్కడే స్టీవ్ నిజ స్వరూపం బయటపడుతుంది. నిజానికి అతను ఒక కానిబాల్. యువతులను ఆకర్షించి, వారిని కిడ్నాప్ చేసి, వారి మాంసాన్ని తినడమే కాకుండా, ధనవంతులైన కానిబాలిస్ట్ క్లయింట్‌లకు విక్రయిస్తుంటాడు. అతను నోవాను ఎక్కువ కాలం ప్రాణాలతో ఉంచాలని, ఆమె మాంసం “ఫ్రెష్”గా ఉండేలా, క్రమంగా ఆమె శరీర భాగాలను కత్తిరించాలని ప్లాన్ చేస్తాడు. నోవా పక్కనే ఉన్న సెల్‌లో మరో బాధితురాలైన పెన్నీ తో మాట్లాడుతుంది. ఆమెను ఇప్పటికే చాలాసార్లు మాంసం కోసం కత్తరించారని చెబుతుంది.
Read Also : ఆఫీస్ బాయ్ వైఫ్ తో రాసలీలలు… పెళ్లాలను మార్చుకునే దిక్కుమాలిన ఆలోచన… సింగిల్స్ కు పండగే
నోవా తనను బంధించిన స్టీవ్‌ను అతని సొంత ఆటలో ఓడించాలని అనుకుంటుంది. ఆమె స్టీవ్‌కు తనపై ఇష్టం ఉందని తెలిసి, అతని బలహీనతను ఉపయోగించుకుంటుంది. ఆమె అతన్ని ఆకర్షించి, ఒక సన్నిహిత క్షణంలో అతని గార్డ్ డౌన్ అయినప్పుడు, అతని శరీర భాగాన్ని కొరికేస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించి తప్పించుకుంటుంది. ఆమె మొల్లీ పెన్నీని రక్షించి, ముగ్గురూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. చివరి యాక్షన్ సీక్వెన్స్‌లో, నోవా, మొల్లీ, పెన్నీ కలసి స్టీవ్, అన్‌లతో తలపడతారు. స్టీవ్, అన్‌లనుంచి వీళ్ళు తప్పించుకుంటారా ? వాళ్లకు బలవుతారా ? అనే క్లైమాక్స్ ని ఈ సినిమాని చూసి తెలుసుకోండి.