E-Paper
Advertisement

OTT Movie : ఫ్రెండును నమ్మి భార్య, కూతురుని ఇంట్లో పెడితే… ఏం చేశాడో తెలిస్తే బుర్ర కరాబ్

OTT Movie : ఫ్రెండును నమ్మి భార్య, కూతురుని ఇంట్లో పెడితే… ఏం చేశాడో తెలిస్తే బుర్ర కరాబ్
Advertisement

OTT Movie : మలయాళం సినిమాలకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి కథలతో వస్తున్న ఈ సినిమాలను, చక్కగా తెరమీద ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఒక ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన మలయాళం మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ మలయాళం మూవీ పేరు ‘మదనోత్సవం‘ (Madanolsavam). 2023 లో వచ్చిన ఈ మూవీకి సుధీష్ గోపీనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో  సూరజ్ వెంజరమూడు, బాబు ఆంటోని, రాజేష్ మాధవన్, భామ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సైనా మూవీస్ బ్యానర్‌పై వినాయక అజిత్ నిర్మించిన ఈ మూవీలో, హీరో తన ఫ్రెండ్ కు ఇచ్చిన మాట కోసం, అతని భార్యను పెళ్లి చేసుకుంటాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

మదన్ కోడి పిల్లలను అమ్మే వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఇతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో, ఇతని మేనత్త అన్ని చూసుకుంటూ ఉంటుంది. ఆమెని అమ్మా అని పిలుస్తూ ఉంటాడు మదన్. కోడి పిల్లల వ్యాపారంతో అతనికి సరిపడే ఖర్చులకి మాత్రమే డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇతని తల్లికి ఆరోగ్యం బాగో లేకపోవడంతో, అరటి పళ్ళను తీసుకురమ్మంటుంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఫ్రెండును అడగడానికి వెళ్తాడు. అయితే ఇతని ఫ్రెండ్, అప్పుడే చెట్టు మీద నుంచి పడి చనిపోతాడు. చివరగా మదన్ తో మాట్లాడుతూ, నా భార్యని, కూతురిని నీవాళ్లుగా చూసుకో అంటూ కన్నుమూస్తాడు. అలా వీళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకు వెళ్తాడు మదన్. ఇంటికి తీసుకెళ్లిన అలైస్ తో మంచిగా నడుచుకుంటాడు. ఇతని ప్రవర్తన చూసి ఆమె కూడా ఇష్టపడుతుంది. ఇలా ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడటంతో, పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే మొదటి రాత్రి మాత్రం కూతురు నిన్ను నాన్న అని పిలిచే అంతవరకు ఆగుదాం అంటుంది. అలా కూతురి చేత నాన్న అని పిలిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు మదన్.

ఒకరోజు అలైస్ కూతురు నాన్న అని పిలవడంతో, మదన్ ఎగిరి గంతులు వేస్తాడు. అలైస్ తో మొదటి రాత్రి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఇంతలోనే మదన్ ని పని ఉందంటూ అతని బాబాయ్ తీసుకువెళ్తాడు. ఆ ఊరిలో రాజకీయ నాయకుడి పేరు కూడా మదన్ అని ఉంటుంది. ఎలక్షన్స్ లో ఇతడు పోటీ చేస్తే, ఓట్లు చీల్చవచ్చని ఆపోజిట్ పార్టీ అనుకుంటుంది. అలా మదన్ బాబాయ్ తో ఆ పార్టీ డీల్ మాట్లాడుకుంటుంది. ఈ విషయాలు ఏమీ తెలియని మదన్ నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలో బాలెట్ పై మదన్ పేరు ఉండడంతో, రాజకీయ నాయకుడు ఓట్లు కూడా ఇతనికి పడతాయి. ఈ కారణంగా ఎమ్మెల్యేగా గెలవాల్సిన వ్యక్తి ఓడిపోతాడు. చివరికి మదన్ ను ఆ నాయకుడు ఏం చేస్తాడు? భార్యతో మొదటి రాత్రి జరుగుతుందా? ఇతనికి మళ్లీ ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘మదనోత్సవం’ (Madanolsavam) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×