Brahmamudi serial today Episode: రాహుల్ వచ్చి రుద్రాణిని బయటకు తీసుకెళ్లి హాస్పిటల్ బిల్ కట్టింది కంపెనీ చెక్ తో కాదు.. క్యాష్‌తో అది కూడా నగలు తాకట్టు పెట్టి బిల్ కట్టారు అని చెప్తాడు. కావ్య ఇంటి దగ్గర నుంచి నగలు వేసుకోకుండా వచ్చినప్పుడే నాకు డౌటు వచ్చింది. అయినా నగలు తాకట్టు పెట్టి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమోచ్చింది అని డౌటు క్రియేట్ చేస్తుంది రుద్రాణి. ఏమో కంపెనీ దివాలీ తీసిందేమో అంటాడు రాహుల్. దీంతో రుద్రాణి ఇన్నాళ్లు నిన్ను మీ అత్తామామలు, మా అమ్మానాన్నలు వెనకేసుకొచ్చారు. ఇప్పుడు గట్టి సాక్ష్యాలతో వస్తున్నాను ఇక నిన్ను ఎవరు కాపాడతారో చూస్తాను అనుకుంటుంది రుద్రాణి.
స్వప్నను రెడీ చేసి బయటకు తీసుకొస్తుంటే.. రుద్రాణి వచ్చి వదిన ఇదేం విడ్డూరం అంటుంది. సరిపోయింది. ఇంకా నువ్వు రాలేదేంటని అనుకుంటున్నాను అంటుంది ఇందిరాదేవి. సరిపోయింది. అందరి మెడలో నగలు ఉండి కావ్య మెడలో ఒక్క నగ కూడా లేకపోతే ఎలా..? దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలు ఇలాగేనా ఉండేది. ఏంటి ఇంకా నగలు తీసుకురాలేదా..? పోనీ రాహుల్ నో.. రాజ్ నో పంపిద్దామా..?. అంటుంది రుద్రాణి. నా నగల గురించి మీరెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రుద్రాణి గారు. ఇలా సింపుల్‌గా ఉండటమే నాకు ఇష్టం. నన్ను ఇలా వదిలేయండి అంటుంది కావ్య.
అదేంటి వదిన నీ కోడలు ఇప్పుడు కనకం కూతురుగా కాకుండా నీ కోడలుగా వచ్చింది కదా..? పది మంది చూస్తూ దుగ్గిరాల కుటుంబం దివాలా తీసిందేమో అనుకోరా..? నాకు తెలిసి నువ్వు కావ్యకు బోలెడన్ని నగలు ఇచ్చినట్టు గుర్తు.. అవునా..? అవును ఇచ్చాను కానీ ఈ పిచ్చి ముఖానికి ఇష్టం లేదు ఏం చేస్తాం.. అంటుంది అపర్ణ. ఇష్టం లేదా..? తేవడం కష్టమా..? అంటుంది రుద్రాణి. అంత ఇదిగా అడుగుతున్నారు. మీ కొడుకేమైనా మాయం చేశాడని డౌటు వచ్చిందా ఏంటి..? అని స్వప్న అడుగుతుంది. మీరెందుకు అడుగుడుగునా అడ్డు పడుతున్నారు రుద్రాణి గారు.. ఇందాక కింద పడ్డప్పుడు నడుముకు మాత్రమే దెబ్బ తగిలిందా..? తలకు కూడా దెబ్బ తగిలిందా..? అని కనకం అడుగుతుంది.
ఇందిరాదేవి మనం పదండి అంటూ చెప్పగానే.. కావ్య ఆగు అంటూ ఈ రుద్రాణి అనడం కాదు కానీ నీ నగలు ఏమయ్యాయి అని అడుగుతుంది అపర్ణ. నీకు బంగారం మీద ఇంట్రస్ట్ లేకపోవచ్చు.. కానీ అందరి ముందు నా కొడలు చిన్నగా ఉండకూడదు. అంటూ తన నెక్లెస్ తీసి కావ్యకు వేస్తుంది అపర్ణ. ఇప్పుడు అద్దంలో చూసుకో ఎలా ఉన్నావో అంటుంది. కావ్య ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంది. అవతల మీ అక్క సీమంతం అవుతుంటే నీ కన్నీల్లేంటి కళ్లు తుడుచుకో అంటూ ఓదారుస్తుంది అపర్ణ.
తర్వాత స్వప్నను బయటకు తీసుకెళ్తారు. అమ్మా ముందు మీరే ఒడి నింపండి అంటూ ఇందిరాదేవికి చెప్తుంది కనకం. కన్నతల్లివి నువ్వే చేయి కనకం అని చెప్తుంది ఇందిరాదేవి.. ఇక్కడ మీ కన్నా పెద్ద మత్తయిదలు ఎవరున్నారమ్మా ముందే మీరే చేయండి అని చెప్తుంది. ఇందిరాదేవి ఒడి నింపి స్వప్నను దీవిస్తుంది. తర్వాత అందరూ స్వప్నకు ఒడి నింపుతూ హ్యాపీగా ఉంటే కనకం ఉద్వేగంతో ఏడుస్తుంది. దీంతో ఇందిరాదేవి కనకం శుభామాంటు సీమంతం జరిగే చోట కన్నీల్లు పెట్టుకోకూడదు అంటుంది. దీంతో కనకం.. అమ్మా ముగ్గురు ఆడపిల్లలను కన్నాను.
ఇప్పుడు నా పెద్ద కూతురు కడుపు పండింది. ఇంతకన్నా పెద్ద పండుగ ఏముంటుంది అమ్మా ఆ ఆనందం తట్టుకోలేక కన్నీళ్లు వస్తున్నావు. ఇవాళ మా సంతోషానికి మీరే కారణం అంటుంది. నాదేం ఉంది కనకం నీ అదృష్టమో.. నీ పిల్లల అదృష్టమో ముగ్గురు నా ఇంటికే కోడళ్లు అయ్యారు అంటుదంది ఇందిరాదేవి. అందరూ ఒడి నించాక హారతి ఇస్తారు. ఇంతలో సీమంతం శ్రీను ఆపండి అంటూ సీరియస్‌గా వస్తాడు.. దీంతో కనకం కోపంగా ఏమైందిరా అని అడుగుతుంది. నా వంటలన్నీ చల్లారిపోతున్నాయి అక్కా వచ్చి తింటారని అంటాడు శ్రీను. సచ్చినోడా అంటూ శ్రీను చెంప పగులగొడుతుంది.
తర్వాత రాహుల్ కోసం ఎదురుచూస్తుంది రుద్రాణి. రాహుల్ రాగానే ముందు రిసిప్ట్ తెచ్చావా..? లేదని చెప్పావో నిన్ను చంపేస్తాను అంటుంది. నువ్వేం కంగారు పడకు మమ్మీ అనుకున్నది సాధించాను. ఆ రిసిప్ట్ సంపాదించాను అంటూ ఫోన్‌లో రిసిప్ట్ చూపిస్తాడు. రేయ్ నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు. ప్రూప్స్ లేకుండానే వాళ్లతో ఎన్నోసార్లు ఆడుకున్నాను. ఇప్పుడు ఫ్రూప్స్ ఉన్నాయి కదా ఇక చూడు పుట్‌బాల్ అడుకుంటాను. అడ్డంగా దొరికిపోయిన కావ్య ఇపుడెలా తప్పించుకుంటావో చూస్తాను వస్తున్నా..? అంటూ లోపలికి వెళ్తుంది.
లోపల అందరూ సంతోషంగా భోజనం చేస్తుంటారు. లోపలికి వచ్చిన రుద్రాణి హాస్పిటల్ ఐదు లక్షల బిల్లు గురించి చెప్తూ.. అకౌంట్ నుంచి కట్టలేదని.. ఎక్కడి నుంచి తెచ్చిందో అది చెప్పమను అని అడుగుతుంది. అసలు నువ్వేం సాధించావో చెప్పు అంటూ అపర్ణ అరవగానే.. ఐదు లక్షల కోసం నీ కోడలు నువ్వు ఇచ్చిన నగలు తాకట్టు పెట్టింది అంటూ రాహుల్ ఫోన్ లో ఉన్న రిసిప్ట్ చూపిస్తుంది రుద్రాణి. కావ్య, రాజ్ మౌనంగా ఉండిపోతారు. రిసిప్ట్ చూసిన అందరూ షాక్ అవుతారు. ఇందిరాదేవి కోపంగా ఏరా కంపునోరు వేసుకుని అది అంతలా అరుస్తుంటే.. నువ్వు మౌనంగా ఉన్నావేంటి అని రాజ్‌ను అడుగుతుంది. దీంతో రాజ్ కోపంగా రుద్రాణిని తిడతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?