BigTV English

IND VS AUS 5Th Test: జట్టు నుంచి రోహిత్ తొలగింపు..పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..స్కోర్‌ ఎంతంటే? !

IND VS AUS 5Th Test: జట్టు నుంచి రోహిత్ తొలగింపు..పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..స్కోర్‌ ఎంతంటే?  !

IND VS AUS 5Th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024/25 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఐదవ టెస్టు ప్రారంభం అయింది. టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్.. సిడ్నీ ( Sidney) వేదికగా జరుగుతోంది. అయితే అందరూ ఊహించినట్లుగానే ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ కు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) దూరమయ్యాడు. గత మూడు టెస్టుల నుంచి విఫలమవుతున్న రోహిత్ శర్మను ( Rohit Sharma) తప్పించింది జట్టు యాజమాన్యం. దీంతో రోహిత్ శర్మ ( Rohit Sharma) ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


Also Read: Ram Charan – Hardik Krunal: గేమ్ చేంజర్ కోసం రంగంలోకి టీమిండియా ప్లేయర్లు!

కెప్టెన్ రోహిత్ శర్మను ( Rohit Sharma) తీయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐదో టెస్టుకు రోహిత్ శర్మ ( Rohit Sharma) దూరం కావడంతో వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)…. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ అయితే గెలిచింది కానీ… గతంలో ఆడినట్లుగానే టీమిండియా ప్లేయర్లు ఆడుతున్నారు. వికెట్లు తొందరగానే ఇచ్చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లకు భయపడిపోతున్నారు టీమ్ ఇండియా ప్లేయర్లు.


ఈ తరుణంలోని మొదటి రోజు మ్యాచ్ లంచ్ సమయానికి.. 25 ఓవర్లు వాడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది. ఓపెన్ యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) పది పరుగులకు అవుట్ కాగా… కేఎల్ రాహుల్ ( Kl Rahul ) 4 పరుగులకు వికెట్ ఇచ్చేశాడు. అటు శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill ) 20 పరుగులు చేసి… లైన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ అటు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) 48 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి ఒక లైఫ్ కూడా వచ్చింది. ఇవాళ్టి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సరిగ్గా ఆడకపోతే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జరిగిన అవమానమే… విరాట్ కోహ్లీ ( Virat Kohli )  కి జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ విషయాలను ఉద్దేశించుకుని… విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అటు ఒక్క మార్పుతో ఆసీస్ బరిలోకి దిగింది.

Also Read: Khel Ratna Award: ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం.. మను, గుకేష్ కు ఛాన్స్!

టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (w), పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(c), ప్రముఖ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×