E-Paper
Advertisement

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!
Advertisement

ChatGPT Stickers Feature: సాధారణంగా ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపులో చాట్ చేస్తున్నప్పుడు గానీ లేదంటే ఫ్యామిలీ గ్రూపులోని మెసేజులకి రిప్లే ఇస్తున్నప్పుడు స్టిక్కర్స్ వాడితే.. అప్పుడు వచ్చే మజానే వేరు కదా. ఎందుకంటే.. భావాలను మాటల్లో కంటే స్టిక్కర్ల ద్వారా చెప్పడానికే చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు ఆ అనుభవాన్ని మరింత సరదాగా మార్చేందుకు ChatGPT ఒక కొత్త ఫీచర్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. మన సొంత ఫొటోలను, మైండ్‌లో ఉన్న క్రేజీ ఐడియాలను, ఫ్రెండ్స్ గ్రూప్ ఇన్‌సైడ్ జోకులను క్షణాల్లో కస్టమ్ స్టిక్కర్లుగా మార్చుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తోంది.

ఏమిటీ కొత్త ఫీచర్ ప్రత్యేకత?

ఇప్పటివరకు మనం వేరొకరు తయారు చేసిన స్టిక్కర్లను లేదా రొటీన్ స్టిక్కర్ ప్యాక్‌లను మాత్రమే వాడేవాళ్లం. కానీ ఈ కొత్త ఫీచర్‌తో మనకు నచ్చినట్లుగా స్టిక్కర్లు డిజైన్ చేసుకోవచ్చు. ఉదా: మీ పెంపుడు కుక్క ఫొటోను కార్టూన్ స్టిక్కర్‌గా మార్చవచ్చు. లేదా నా వల్ల కాదు! అని చెప్పే ఒక సరదా పిల్లి బొమ్మను టెక్స్ట్‌తో సహా తయారు చేయమని అడగవచ్చు. దీనివల్ల చాటింగ్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Advertisement

Also Read: ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్, ఎడిటింగ్:

ఈ ఫీచర్‌లో ప్రధాన ఆకర్షణ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్. సాధారణంగా ఫొటోలను స్టిక్కర్లుగా మార్చినప్పుడు వెనుక ఉండే బ్యాక్‌గ్రౌండ్ వల్ల అవి సరిగ్గా కనిపించవు. కానీ చాట్‌జీపీటీ ఇమేజెస్ ద్వారా వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ను పూర్తిగా తొలగించి, మెసేజింగ్ యాప్‌లలో సహజంగా కలిసిపోయేలా స్టిక్కర్‌ను రౌండ్ లేదా కట్ షేప్‌లో ఇస్తుంది. ఒకవేళ స్టిక్కర్ నచ్చకపోతే ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మార్చడం, కొత్త టెక్స్ట్ జోడించడం లేదా కలర్స్ మార్చడం వంటి మార్పులు కూడా చాట్‌జీపీటీని అడిగి చేయించుకోవచ్చు.

ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి?

Advertisement

ChatGPT ఇమేజ్ జనరేషన్ యాక్సెస్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ ఫీచర్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ప్లస్, ప్రో, బిజినెస్ యూజర్లకు కొన్ని అడ్వాన్స్‌డ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని వాడటం చాలా సులభం. మీ ఫోన్ లేదా వెబ్‌లో చాట్‌జీపీటీ ఓపెన్ చేసి.. సైడ్‌బార్‌లో ఉన్న Images సెక్షన్‌కు వెళ్లి Stickers ఎంచుకోవాలి.

అక్కడ మీ వద్ద ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేయొచ్చు లేదా మీకు కావాల్సిన స్టిక్కర్ గురించి టెక్స్ట్ టైప్ చేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ వద్దనుకుంటే ట్రాన్స్‌పరెంట్ చేయమని అడిగితే సరిపోతుంది. స్టిక్కర్ రెడీ అయ్యాక దాన్ని సేవ్ చేసుకుని వాట్సప్‌లో ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడమే.

Also Read: ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

Tags

Related News

కరెంట్ పోయినా కూలింగ్ పోదు..ఇన్వర్టర్ కనెక్టివిటీతో 5 డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

అమెజాన్ సేల్‌లోబెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్, బ్లెండర్స్‌పై భారీ డిస్కౌంట్

జియో 5జీ vs స్టార్‌లింక్.. రెడింటి మధ్య తేడా ఏంటి? భారత్ కు ఏ టెక్నాలజీ బెస్ట్?

స్టార్‌లింక్ నిజంగా ప్రమాదకరమా? భారత్ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది?

ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

Big Stories

Advertisement
×