BigTV English

OTT Movie : సొంత పిల్లలనే చంపాలనుకునే తల్లి… ఈ దెయ్యం కోరికలు చూస్తే గుండె జారిపోద్ది భయ్యా

OTT Movie : సొంత పిల్లలనే చంపాలనుకునే తల్లి… ఈ దెయ్యం కోరికలు చూస్తే గుండె జారిపోద్ది భయ్యా

OTT Movie : తాతలు చెప్పే కథలలో, చందమామ పుస్తకాలలో మాత్రమే దెయ్యాలను ఊహించుకున్న మనం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో దెయ్యాలను చూసే కాలానికి వచ్చాం. కాలం మారినా, దెయ్యాల స్టోరీలు మాత్రం మారలేదు. ఓటీటీలో ఎటువంటి దెయ్యం కావాలన్నా అందుబాటులోఉంది. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలీదు గానీ, దెయ్యాల సినిమాలకి మాత్రం భయపడుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో , చందమామ కథలలో మాదిరి తప్పిపోయిన అమ్మాయిలను కాపాడుతూ ఉంటుంది ఒక దెయ్యం. వాళ్ళను సొంత తల్లిలా చూసుకుంటుంది. ఆ తరువాత స్టోరీ అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

జెఫ్రీ డెసంజ్ అనే వ్యక్తి, ఆర్థిక సమస్యల కారణంగా పీకల్లోతు కష్టాలలో మునిగిపోతాడు. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయి, తన భార్యను చంపేస్తాడు. తన ఇద్దరు కూతుళ్లు విక్టోరియా, లిల్లీని తీసుకుని పారిపోతాడు. కానీ కారు వేగంగా నడుపుతూ, ఒక రోడ్డు ప్రమాదంలో జెఫ్రీ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. కూతుళ్లు అడవిలోని ఒక పాడుబడిన ఇంటిలో చిక్కుకుపోతారు. అక్కడ వారిని ‘మామా’ అనే అతీంద్రియ శక్తి రక్షిస్తుంది. ఈ ‘మామా’ అనే ఆత్మకి ఒక విషాధకరమైన గతం ఉంటుంది. అందువల్ల చిన్న పిల్లలుగా వున్న వీళ్ళని రక్షిస్తూ ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత, జెఫ్రీ సోదరుడు లూకాస్, అతని స్నేహితురాలు అన్నబెల్ అమ్మాయిల కోసం వెతుకుతూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెడతారు.


ఈ అమ్మాయిలు అడవిలో ఒంటరిగా జీవించడం వల్ల ఆ ప్రాంతానికి అలవాటు పడి ఉంటారు. వీళ్ళు’మామా’ ఆత్మతో ఒక బలమైన బంధం ఏర్పరచుకుని ఉంటారు. లూకాస్, అన్నబెల్ అమ్మాయిలను తమ ఇంటికి తీసుకొస్తారు. కానీ ‘మామా’వారిని వెంబడిస్తుంది. ఈ ఆత్మ అమ్మాయిలను తీసుకుని పోవడం వల్ల ప్రమాదకరంగా మారుతుంది. చివరికి ‘మామా’ వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి ? ‘మామా’ ఆత్మ గతం ఏమిటి ? ఈ అమ్మాయిలను ‘మామా’ విడిచిపెడుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్‌ న్యాచురల్ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు… దృశ్యం సినిమాకి మించిన సస్పెన్స్

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ సూపర్‌ న్యాచురల్ హారర్ మూవీ పేరు ‘మామా’ (Mama). 2013లో వచ్చిన ఈ మూవీకి ఆండీ ముషియెట్టి దర్శకత్వం వహించారు. మైల్స్ డేల్ దీనిని నిర్మించారు. ఇందులో జెస్సికా చస్టెయిన్, నికోలాజ్ కోస్టర్-వాల్డౌ, మేగాన్ చార్పెంటియర్, ఇసాబెల్లె నెలిస్సే, డేనియల్ కాష్, జేవియర్ బోటెట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ అడవిలో తప్పిపోయిన ఇద్దరు యువతులను చుట్టూ తిరుగుతుంది. $15 మిలియన్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ మూవీ $148 మిలియన్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ విజయాన్ని సాధించింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×