Pragya Jaiswal:ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) .. హాట్ బ్యూటీగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె.. తన గ్లామర్ తో అందరినీ కట్టిపడేస్తోంది. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి. ముఖ్యంగా యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో కలిసి నటించిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజూ తనకు సంబంధించిన ఏదో విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా గ్లామర్ ఫోటోలతో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకి ఘోర అవమానం జరిగినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఫోటోగ్రాఫర్లపై ప్రగ్యా జైస్వాల్ అసహనం..
సాధారణంగా హీరోలు, హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లో కనిపించారంటే చాలు వారితో సెల్ఫీలు దిగడానికి, కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడుతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది ఓపికగా సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్స్ ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో.. ఫంక్షన్లలో.. పార్టీలలో కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు వారి వెంటపడి మరీ ఫోటోలు తీస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్లు చేసే పనికి హీరోయిన్లు కూడా చిరాకు పడుతూ.. ఫోటోగ్రాఫర్లపై మండిపడుతూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సంఘటన ప్రగ్యా జైస్వాల్ కి కూడా ఎదురయింది.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.
ప్రగ్యా జైస్వాల్ డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్స్..
తాజాగా ఒక పార్టీలో కనిపించింది ప్రగ్యా జైస్వాల్ . అయితే ఫోటోగ్రాఫర్లందరూ ఒక్కసారిగా ఈమె ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. దానితో ఆమె చిరాకు పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇది చూసిన నెటిజన్లు అలాంటి డ్రెస్ వేసుకోవడం ఎందుకు? ఫోటోలు తీస్తే ఇబ్బంది పడి ఫోటోగ్రాఫర్లపై చిరాకు పడడం ఎందుకు? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికైతే తన అందాలతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈమె ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. అంతేకాదు ఆమె ఏదో పార్టీ కోసం డ్రెస్ వేసుకుని వెళ్తే ఇప్పుడు ఇలా నెటిజన్స్ ట్రోల్స్ చేయడంపై కుమిలిపోతోందని సమాచారం
ప్రగ్యా జైస్వాల్ సినిమా కెరియర్..
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తెలుగు, తమిళ్ సినిమాలలో నటించి అబ్బురపరిచింది. ముఖ్యంగా ‘మిర్చి లాంటి అబ్బాయి’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కంచె సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఇప్పుడు ‘అఖండ’ సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. కానీ మళ్లీ అవకాశాలైతే రాలేదు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ‘అఖండ 2’ లో కూడా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మరో అవకాశం ఈమె చేతిలో లేదనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే మరొకవైపు యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది మొత్తానికి అయితే ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు పాపరాజీలపై మండిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:D Boss Darshan : మర్డర్ చేసిన వాడు హీరోనా… దర్శన్‌పై తెలుగు ఆడియన్స్ ఫైర్!
?utm_source=ig_web_copy_link