E-Paper
Advertisement

OTT Movie : వరుస హత్యలకు గురయ్యే క్రిమినల్స్ … టీచర్ కి లింకు… ఓటిటిలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : వరుస హత్యలకు గురయ్యే క్రిమినల్స్ … టీచర్ కి లింకు… ఓటిటిలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : సీనియర్ నటుడు అర్జున్, ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తీయవర్ కులై నడుంగ’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో రిలీజైన 20 రోజులకే ఇది డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీశారు. ఈ కథ చిల్డ్రన్ స్కూల్‌లో జరిగిన క్రూరమైన మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత ఇందులో నేర చరిత్ర ఉన్నవాళ్లు వరుసగా హత్యకు గురవుతుంటారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఉంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘తీయవర్ కులై నడుంగ’ (Theeyavar Kulai Nadunga) 2025 నవంబర్ 21న థియేటర్లలో అడుగు పెట్టింది. ఇందులో అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. నూతన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనికా రాధాకృష్ణన్, టైగర్ తంగదురై, అభిరామి వెంకటచలం, ప్రవీణ్ రాజా వంటి వాళ్ళు కీ రోల్స్ లో నటించారు. 2025 డిసెంబర్ 12 నుంచి Sun NXTలో ఈ సినిమా స్ట్రీమింగ్ ఉంది. ఐ యండిబిలో 7.6/10 రేటింగ్ ని పొందింది.

Advertisement

Read Also : సైకో గ్యాంగ్ అరాచకం… థియేటర్ల నుంచి పరుగులు పెట్టిన జనం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

స్టోరీలోకి వెళ్తే

ఒక రోజు రాత్రి రోడ్డు మీద రచయిత జెబనేసన్ మర్డర్‌తో ఈ స్టోరీ మొదలవుతుంది. అతన్ని బ్లాక్ సూట్, హెల్మెట్ ధరించిన వ్యక్తి చంపేస్తాడు. ఈ కేస్ ఇన్స్పెక్టర్ మగుడపతి (అర్జున్ ) చేతికి వస్తుంది. అతను చాలా తెలివిగా కేసులను డీల్ చేస్తుంటాడు. విచారణలో చిల్డ్రన్ స్కూల్ టీచర్ మీరా (ఐశ్వర్య రాజేష్) కీ రోల్ అవుతుంది. ఆమె స్కూల్‌లో జరిగిన క్రూరమైన ఇన్సిడెంట్‌లతో లింక్ అవుతుంది. మర్డర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పిల్లలపై జరిగిన దారుణాలు బయటపడతాయి. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. చివరికి ఈ హత్యలకు టీచర్ కు సంబంధం ఉందా? హత్యలను చేస్తుంది ఎవరు ? మగుడపతి ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? అన్నది ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

 

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×