OTT Movie : కేరళలోని ఒక చిన్న గ్రామం భయంతో వణుకుతోంది. ఒక సీరియల్ కిల్లర్ వృద్ధులను కిడ్నాప్ చేసి, వారి నోటిలో అరటిపండు కుక్కి సుత్తితో కొట్టి చంపుతుంటాడు. స్థానిక ట్రబుల్‌మేకర్ లూక్ పీపీ (బాసిల్ జోసెఫ్), తన విచిత్రమైన ప్రవర్తన వల్ల పోలీసులకు ప్రధాన అనుమానితుడిగా మారతాడు. ఒక రోజు రాత్రి, ఒక బస్సులో జరిగే అనుకోని సంఘటనలు లూక్‌ను, అతని మాజీ ప్రేమికురాలు జెస్సీ (అనిష్మా అనిల్‌కుమార్), బస్ కండక్టర్ అరువి (సిజు సన్నీ), డ్రైవర్ జిక్కు (సురేష్ కృష్ణ) ఒక డెడ్‌బాడీతో చిక్కుకునేలా చేస్తాయి. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు ? బస్సులో ఉన్న శవం ఎవరిది ? ఈ సినిమాపేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
కేరళలోని ఒక గ్రామంలో ఈ స్టోరీ జరుగుతుంది. ఒక సీరియల్ కిల్లర్ ‘బనానా కిల్లర్’ అని పిలవబడే శ్రీకుమార్ (రాజేష్ మాధవన్) చుట్టూ తిరుగుతుంది.ఇతను వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, వాళ్ళను సుత్తితో కొట్టి, నోటిలో అరటిపండు కుక్కి చంపుతుంటాడు. ఈ హత్యలు గ్రామంలో భయాన్ని రేకెత్తిస్తాయి. Dsp అజయ్ రామచంద్రన్ (బాబు ఆంటోనీ) ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. అదే గ్రామంలో లూక్ పీపీ (బాసిల్ జోసెఫ్) అనే వ్యక్తి రంగు జుట్టు, విచిత్రమైన ప్రవర్తనతో గ్రామంలో అందరికీ సమస్య తెస్తుంటాడు. స్కూల్ స్టాఫ్ రూమ్‌ను కాల్చడం నుండి ఒక రాజకీయవేత్త హిస్టరీని లీక్ చేయడం వరకు అతని చార్యల వల్ల విసుగెత్తిపోతారు గ్రామస్తులు. అతని ఈ చర్యల వల్ల పోలీసులు అతన్ని బనానా కిల్లర్‌గా అనుమానిస్తారు. లూక్ తన మాజీ ప్రేమికురాలు జెస్సీతో సంబంధాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతని ప్రవర్తనతో విసిగిపోయి అతన్ని తిరస్కరిస్తుంది.
ఇంతలో బస్ కండక్టర్ అరువి (సిజు సన్నీ), తన తండ్రి కనిపించకుండా పోవడంతో బాధపడుతుంటాడు. బస్ డ్రైవర్ జిక్కు (సురేష్ కృష్ణ) మాత్రం తనకు లేటు వయసులో వివాహం జరుగుతున్నందుకు ఉత్సాహంగా ఉంటాడు. ఇక స్టోరీలో ఒక మలుపు వస్తుంది. ఈ కీలకమైన మలుపు ఒక రాత్రి బస్సులో జరుగుతుంది. ఇక్కడ లూక్, జెస్సీ, అరువి, జిక్కు ఒక డెడ్‌బాడీతో చిక్కుకుంటారు. ఈ గందరగోళంలో, వీళ్ళు అనుకోకుండా ఒక హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వారిలోనే బనానా కిల్లర్ ఉన్నాడని వారికి తెలియదు. చివరికి బస్సులో ఉన్న శవం ఎవరిది ? కిల్లర్ ముసలి వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు ? పోలీసులు అతన్ని పట్టుకుంటారా ? లూక్ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : జీవితాన్ని నరకంగా మార్చే ఆన్లైన్ షాపింగ్… కొరియాను షేక్ చేసిన రియల్ స్టోరీ
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మరణమాస్’ (Maranamass). 2025 లో వచ్చిన ఈ సినిమాకి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇందులో బాసిల్ జోసెఫ్ (లూక్ పీపీ), అనిష్మా అనిల్‌కుమార్ (జెస్సీ), రాజేష్ మాధవన్ (శ్రీకుమార్/బనానా కిల్లర్), సిజు సన్నీ (అరువి), సురేష్ కృష్ణ (జిక్కు), బాబు ఆంటోనీ (డీవైఎస్పీ అజయ్ రామచంద్రన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓటీటీలో 2025 మే 15 నుంచి (SonyLIV) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ డబ్బింగ్‌లతో స్ట్రీమింగ్‌లో ఉంది. 2 గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.5/10 రేటింగ్ ఉంది.