BigTV English

OTT Movie : ప్రియురాలితో ఆ పని చేస్తూ పైకి పోయే ప్రియుడు… ఇదెక్కడి లవ్ స్టోరీ రా బాబూ

OTT Movie : ప్రియురాలితో ఆ పని చేస్తూ పైకి పోయే ప్రియుడు… ఇదెక్కడి లవ్ స్టోరీ రా బాబూ

OTT Movie : జీవితంలో ఆటుపోటులు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే అసలు జీవితం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ప్రేమించే మనుషులు దూరమైతే, ఆ బాధ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


డిస్నీ + హాట్ స్టార్ (Disney + hotstar) లో

ఈ మూవీ పేరు ‘మసాన్‘ (Masaan). రిచా చద్దా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీకి నీరజ్ ఘయ్‌వాన్‌కి దర్శకత్వం వహించారు. దర్శకుడు నీరజ్ ఘయ్‌వాన్‌కి, విక్కీ కౌశల్‌కి ఇది తొలి పరిచయం. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది. ఇది పరియేరుమ్ పెరుమాళ్, కాలా మరియు ఫాండ్రీలతో పాటు 2019లో ప్రారంభమైన న్యూయార్క్ దళిత్ ఫిల్మ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ మూవీ విడుదలైనప్పటి నుండి, కల్ట్ స్టేటస్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

దేవి ఇంజనీరింగ్ చదువుతూనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతనిని కలుసుకొని ఫిజికల్ గా కలవడానికి ఒక లాడ్జికి వెళ్తుంది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాము కదా అని వీళ్ళు ఆ పని మొదలు పెడతారు. అక్కడికి పోలీసులు వచ్చి వీళ్లను అరెస్ట్ చేస్తారు. పీయూష్ కి తన తండ్రి అంటే భయం ఉండటంతో, ఎ విషయం ఎక్కడ తెలుస్తుందేమో అని చేయి కోసుకుంటాడు. ఆ తర్వాత పియూస్ చనిపోవడంతో, దేవి తండ్రిని పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తారు. లేకపోతే ఆ వీడియోలు బయట పెడతానని చెప్పడంతో, దేవి తండ్రి డబ్బులు ఇవ్వడానికి కాస్త సమయం అడుగుతాడు. అతను కాశీలో శవాలమీద కప్పే వస్త్రాలను అమ్ముతూ ఉంటాడు. పోలీసులకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు దేవి తండ్రి.

మరోవైపు దీపక్ చదువుకుంటూనే ఆన్లైన్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. జాతరలో కలుసుకొని ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. చాలాకాలం ప్రేమించుకున్న వీళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. చదువు పూర్తి చేసుకొని దీపక్ ఇంటికి వస్తాడు. దీపక్ ఫ్యామిలీ కాశీలో శవాలను కాలుస్తూ ఉంటుంది. కాశీలో ఈ పని దీపక్ చేస్తూ ఉండగా, అక్కడికి తను ప్రేమించిన అమ్మాయి శవం కనబడుతుంది. అది చూసిన దీపక్ ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా దీపక్, దేవిల ప్రయాణం ఒక చోట మొదలవుతుంది. చివరికి దీపక్, దేవిల లైఫ్ ఎటు వెళ్తుంది? ఈ రెండు కథలలో ముగింపును తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మసాన్’ (Masaan) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×