BigTV English

Thandel Pre Release Event: ఫ్యాన్స్ లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్.. బన్నీ కోసం అభిమానులనే వదిలేశారా.?

Thandel Pre Release Event: ఫ్యాన్స్ లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్.. బన్నీ కోసం అభిమానులనే వదిలేశారా.?

Thandel Pre Release Event: యంగ్ హీరో నాగచైతన్య ఇప్పటివరకు ఎక్కువ ప్రేమకథలతో తన కెరీర్‌ను ముందుకు నడిపించాడు. తను కమర్షియల్ సినిమాల్లో నటించడానికి ట్రై చేసినా కూడా అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం నాగచైతన్యకు హిట్ దక్కి చాలాకాలమే అయ్యింది. అందుకే తన ఆశలన్నీ ‘తండేల్’పైనే ఉన్నాయి. పైగా తన కెరీర్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన సినిమా కావడంతో దీనిని ప్రమోట్ చేయడానికి చైతూ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ప్రతీ భాషలో ‘తండేల్’ను బాగానే ప్రమోట్ చేశారు. ఇప్పుడు తెలుగులో కూడా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కానీ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం వల్ల మూవీ టీమ్ అంతా ఒక నిర్ణయానికి వచ్చారు.


ఈవెంట్‌పై ఎఫెక్ట్

‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రానున్నాడని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అంతా తెగ ఎగ్జైట్ అయ్యారు. కానీ తీరా చూస్తే అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు ఫ్యాన్స్‌కు ప్రవేశం లేదనే విషయం బయటపడింది. ఇప్పటికే గత కొన్నిరోజులుగా బన్నీ ఫ్యాన్స్ వల్ల బయట ఏదో ఒక విధంగా రచ్చ జరుగుతూనే ఉంది. అల్లు అర్జున్ స్వయంగా ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌కు వెళ్లడం వల్ల ఒక మహిళ ప్రాణం పోయింది. అందుకే అప్పటినుండి ఫ్యాన్స్ ముందుకు రావాలంటే ఆలోచిస్తున్నాడు అల్లు అర్జున్. అదే ఇప్పుడు ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ప్రభావం చూపనుంది.


మరిన్ని జాగ్రత్తలు

ఏ ఈవెంట్‌లో అయినా ఫ్యాన్స్ ఉంటే ఆ కిక్కే వేరు. కానీ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం వల్ల ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాఫీగా సాగడానికి తన ఫ్యాన్స్ సైతం పక్కన పెట్టేశాడు చైతూ. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన మళ్లీ రిపీట్ అవుతుందేమో అని అల్లు అర్జున్ మాత్రమే కాదు.. మిగతా హీరోలు సైతం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆ ఘటన తర్వాత జరిగిన ప్రతీ ఈవెంట్‌కు అత్యంత జాగ్రత్తలు తీసుకొని మరీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ‘తండేల్’ విషయంలో కూడా అదే జరగనుంది. శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న ఈవెంట్‌కు కేవలం మూవీ టీమ్ మాత్రమే హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

Also Read: ప్లీజ్ నాకు పని ఇవ్వండి.. స్టేజ్‌పైనే బాలీవుడ్ హీరోకు ‘తండేల్’ డైరెక్టర్ రిక్వెస్ట్..

ప్రతీ భాషలో

చందు మోండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ (Thandel) సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. అందుకే ప్రతీ భాషా ప్రేక్షకుడికి ఈ సినిమా గురించి తెలియాలని ఇప్పటికే ముంబాయ్, చెన్నైలో ఈవెంట్స్ ఏర్పాటు చేశారు మేకర్స్. కార్తీ చేతుల మీదుగా తమిళ ట్రైలర్‌ను, అమీర్ ఖాన్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్‌ను విడుదల చేయించారు. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలిచి ‘తండేల్’పై మరింత హైప్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ లేకుండానే ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 7న విడుదలయ్యే ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×