BigTV English

OTT Movie: ఈ ఊర్లో అమ్మాయిగా పుట్టడం అంటే గత జన్మలో చేసుకున్న పాపమే… అదిరిపోయే ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

OTT Movie: ఈ ఊర్లో అమ్మాయిగా పుట్టడం అంటే గత జన్మలో చేసుకున్న పాపమే… అదిరిపోయే ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

OTT Movie : కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు, ఇలా నిజజీవితంలో జరిగితే ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇటువంటి స్టోరీలు ఆలోచనలు రేకిత్తిస్తుంటాయి. ఇప్పుడుమనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఆడవాళ్ళు అంతరించిపోయిన ఒక గ్రామంలో  తిరుగుతుంది. ఆగ్రామంలో పరిస్థితులు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటాయి. ఇది ఒక గ్రిప్పింగ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఒక గ్రామంలో స్త్రీ భ్రూణహత్యలు ఎక్కువగా జరిగిన కారణంగా, స్త్రీలు దాదాపుగా అంతరించిపోయిన భవిష్యత్తు నేపథ్యంలో కథ జరుగుతుంది. ఈ గ్రామంలో పురుషులు మాత్రమే ఉంటారు. స్త్రీలు లేకపోవడం వల్ల వీళ్ళ జీవన విధానం అస్తవ్యస్తంగా మారుతుంది. రామ్‌చరణ్ అనే సంపన్న వ్యక్తి తన ఐదుగురు కొడుకుల కోసం కల్కిని అనే ఒక యువతిని (తులిప్ జోషి) వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రికి డబ్బులు ఇచ్చి కొంటాడు. కానీ ఈ వివాహం కల్కి జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ఎందుకంటే ఆమెను ఐదుగురు సోదరులు, వాళ్ళ తండ్రి కూడా శారీరకంగా వేధిస్తారు. కల్కి ఈ కుటుంబంలో ఒక వస్తువులా చూడబడుతుంది. ఆమె జీవితం హింసతో నిండిపోతుంది.


ఈ గ్రామంలో స్త్రీలు లేనందున, పురుషులు తమ కోరికలను తీర్చుకోవడానికి హింసాత్మక మార్గాలను ఎంచుకుంటారు. అయితే కల్కి వీరిలో చిన్న కొడుకు పై ప్రేమను పెంచుకుంటుంది. ఎందుకంటే అతను మాత్రమే ఆమెను మనిషిగా గౌరవిస్తాడు. కానీ ఈ సంబంధం ఇతర సోదరులలో ఈర్ష్యను రేకెత్తిస్తుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ క్రమంలో కల్కి గర్భవతి కూడా అవుతుంది. చివరికి కల్కి పరిస్థితి ఏమౌతుంది ? ఈ సోదరులు ఎటువంటి సమస్యల్లో చిక్కుకుంటారు ? అనే విషయాలను తెఊసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఈ అమ్మాయి అరాచకం చూడడానికి రెండు కళ్ళూ చాలవు… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సినిమా పేరు ‘మాతృభూమి: ఎ నేషన్ వితౌట్ ఉమెన్’ (Matrubhoomi: A Nation Without Women). ఈ సినిమాకి మనీష్ ఝా దర్శకత్వం వహించారు. ఇందులో తులిప్ జోషి (కల్కి), సుషాంత్ సింగ్, ఆదిత్య శ్రీవాస్తవ్, సుధీర్ పాండే, పియూష్ మిశ్రా వంటి నటులు నటించారు. ఈ సినిమా ఒక డిస్టోపియన్ భవిష్యత్తు నేపథ్యంలో జరుగుతుంది. ఆడపిల్ల పుట్టగానే చంపేసే ఈ సమాజంలో కొంతకాలం తరువాత ఒక గ్రామంలో అమ్మాయిలే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ‘మాతృభూమి’ విస్తృతమైన విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా వివిధ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×