E-Paper
Advertisement

Horoscope Today June 3rd: తెలుగు రాశి ఫలితాలు: ఆ రాశి వారికి భూ వస్తు వాహన లాభం – అన్ని వైపుల నుంచి ఆదాయం  

Horoscope Today June 3rd: తెలుగు రాశి ఫలితాలు: ఆ రాశి వారికి భూ వస్తు వాహన లాభం – అన్ని వైపుల నుంచి ఆదాయం  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జూన్‌ 3న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి.

Advertisement

వృషభం: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది.

మిథునం: చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది.

Advertisement

కర్కాటకం: ధన పరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవడం మంచిది.

సింహం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.

కన్య: కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాదిస్తారు. కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున కొందరి మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

మకరం: బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.

కుంభం: కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×