E-Paper
Advertisement

డివోర్స్ తల్లికి దిమ్మతిరిగే షాక్… ఆన్‌లైన్ వెబ్‌క్యామ్ సెషన్‌లో అరాచకం

డివోర్స్ తల్లికి దిమ్మతిరిగే షాక్… ఆన్‌లైన్ వెబ్‌క్యామ్ సెషన్‌లో అరాచకం
Advertisement

Comedy Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ కు కామెడీ యాడ్ అయితే ఆ కిక్కే వేరు కదా. ఇలాంటి సినిమాలను ఓటీటీలో వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి ఓ మంచి థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సినిమా పేరేంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సినిమా గురించి కాదు సిరీస్ గురించి. ఇది మైండ్-బెండింగ్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ Maximum Pleasure Guaranteed (2026). ప్రముఖ నటి టాటియానా మస్లానీ, జేక్ జాన్సన్ మెయిన్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ లో ఒక సాధారణ మహిళ జీవితం ఆన్‌లైన్ నేర ప్రపంచం వల్ల ఎలా తలకిందులైందో అనేది ఎంటర్టైనింగ్ గా చూపించారు. డేవిడ్ జె. రోసెన్ సృష్టించిన ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్లు ఉంది. 2026 మే 20 నుండి Apple TV+ లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ దర్శకుడు ‘డేవిడ్ గోర్డాన్ గ్రీన్’ దీనికి దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో బ్లడీ బ్లడ్ బాత్ తో పాటు ఆధునిక కాలంలో అందరూ అనుభవిస్తున్న ఒంటరితనం, ఇంటర్నెట్ మోసాలు, ఒక తల్లి పోరాటాన్ని డార్క్ హ్యూమర్‌ తో కలిపి అద్భుతంగా చూపించారు.

కథలోకి వెళ్తే…

పాపులర్ మ్యాగజైన్‌ లో ఫ్యాక్ట్-చెక్కర్‌ గా పని చేసే సాధారణ సింగిల్ మదర్ పౌలా. రీసెంట్ గా భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, తన కూతురి కస్టడీ కోసం ట్రై చేస్తుంది. మరోవైపు వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంది కూడా. ఓరోజు రాత్రి ఆమె అనుకోకుండా ఒక ఆన్‌లైన్ వెబ్‌ క్యామ్ సెషన్‌ లో షాకింగ్ విషయాన్ని చూస్తుంది. ఒక క్యామ్ బాయ్ (Cam Boy) దారుణంగా హత్యకు గురవడాన్ని కళ్లారా చూసిన ఆమెకు మతిపోతుంది. దీంతో పౌలా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ ఆ శవం మాయమవ్వడం, అలాగే ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు ఆమె భ్రమ పడి ఉంటుందని అనుకొని సీరియస్ గా తీసుకోకుండా కొట్టిపారేస్తారు.

Advertisement

Also Read : హిట్లర్ కు వణుకు పుట్టించిన అమెరికన్ ఆర్మీ… ఐయండిబిలో 9.4 రేటింగ్

పోలీసుల నుంచి ఎలాంటి సాయం అందక పోవడంతో పౌలా షాకింగ్ నిర్ణయం తీసుకుటుంది. తన ప్రొఫెషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నైపుణ్యాలను ఉపయోగించి రహస్యంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో కార్ల్ (జేక్ జాన్సన్) అనే వ్యక్తి ఆమెకు హెల్ప్ చేస్తాడు. పౌలా ఇన్వెస్టిగేషన్ లోతుగా వెళ్లే కొద్దీ ఆన్లైన్ డిజిటల్ ప్రపంచం వెనుక ఒక పెద్ద బ్లాక్‌మెయిల్ మాఫియా నడుస్తోందని తెలుసుకుంటుంది. హంతకులు పౌలా ఉద్యోగం దగ్గర నుంచి ఆమె కూతురు, మాజీ భర్త గురించిన రహస్యాలన్ని వాడి, ఆమె నోరు మూయించడానికి ట్రై చేస్తారు. ఆ తరువాత సినిమాలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. మరి ఆ మలుపు ఏంటి ? హంతకులు ఎవరు? వాళ్ళను చివరికి పోలీసులు ఎలా పట్టుకున్నారు ? అన్నది కథ.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×