E-Paper
Advertisement

నిందలు వేసినోళ్ల ముందే చుక్కలు చూపించిన ఆడది… ఆస్కార్ గెలిచిన ఎమోషనల్ డ్రామా

నిందలు వేసినోళ్ల ముందే చుక్కలు చూపించిన ఆడది… ఆస్కార్ గెలిచిన ఎమోషనల్ డ్రామా
Advertisement

Melo Drama OTT : ట్రాన్స్‌జెండర్ కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిలీ దేశపు సినిమా ఆస్కార్ గెలవడం విశేషం. ఇది ఒక ఎమోషనల్ డ్రామా సినిమా. లోకమంతా ఒక ట్రాన్స్‌జెండర్ ని వెలివేసి, వింత జంతువులా చూస్తున్నప్పుడు, ఆ మనిషి గుండె నిబ్బరంతో ఎలా ఎదురు తిరిగి నిలబడ్డదనేదే ఈ సినిమా అసలు సిసలు మ్యాటర్. తనని ప్రేమించినోడు చచ్చిపోతే, కడసారి కళ్లారా చూసుకోనివ్వకుండా, ఆమెను కుక్కల కంటే హీనంగా చూస్తారు ఇందులో. అయితే ఆమె ప్రియుడి అంత్యక్రియలను చూడాలని తను చేసే పోరాటం చూస్తే కళ్లు చెమర్చుతాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2017లో వచ్చిన ఈ మెలో డ్రామా మూవీ పేరు ‘ఎ ఫెంటాస్టిక్ ఉమెన్’ (A Fantastic Woman). ఇది సెబాస్టియన్ లెలియో దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మెరీనా పాత్రలో డానియెలా వెగా అద్భుతంగా నటించింది. ఆమె నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. సినిమాలో నటించిన డానియెలా వెగా నిజ జీవితంలో కూడా ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. మొదట ఆమెను కేవలం సినిమా కథలో సలహాలు ఇవ్వడానికి మాత్రమే తీసుకున్నారు. కానీ ఆమె ప్రతిభను చూసిన దర్శకుడు సెబాస్టియన్ లెలియో ఆమెనే మెయిన్ హీరోయిన్‌గా పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆస్కార్ వేదికపై ప్రెజెంటర్‌గా నిలిచిన మొదటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు చూసి, చిలీ దేశం తమ చట్టాలను కూడా మార్చింది. ట్రాన్స్‌జెండర్లు చట్టబద్ధంగా తమ పేరును, జెండర్‌ని మార్చుకోవడానికి వీలు కల్పించే ‘జెండర్ ఐడెంటిటీ లా’ రావడానికి ఈ మూవీ ఒక ముఖ్య కారణమైంది. ఇది బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుతో పాటు, 90వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ గెలుచుకుని చిలీ దేశపు సినిమా సత్తా చాటింది. ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మెరీనా అనే ఒక అమ్మాయి హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ, నైట్ టైం క్లబ్బుల్లో పాటలు పాడుతూ బతుకుతుంటుంది. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ (లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి). ఒర్లాండో అనే ఒక పెద్దాయనతో ఆమె ప్రేమలో ఉంటుంది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైంలో, ఒక రోజు రాత్రి ఒర్లాండోకి ఒంట్లో నలతగా అనిపించి కింద పడిపోతాడు. మెరీనా కంగారుగా హాస్పిటల్‌కి తీసుకెళ్లినా ఫలితం లేకపోతుంది. ఆయన కన్నుమూస్తాడు. అక్కడి నుండే మెరీనా కష్టాలు మొదలవుతాయి.

ఒర్లాండో చనిపోగానే అతని మాజీ భార్య, కొడుకు, మిగతా చుట్టాలు మెరీనా మీద విరుచుకుపడతారు. ఆమెను మనిషిలా కూడా చూడకుండా అసహ్యించుకుంటారు. పోలీసులు, డాక్టర్లు ఆమెను బట్టలు విప్పించి మరీ అవమానకరంగా తనిఖీ చేస్తారు. అంత్యక్రియలకు రావద్దు అంటూ, ఆ ముసలాయన కుటుంబ సభ్యులు ఆమెను కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు గెంటేస్తారు. చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆమెను ఛీత్కరించుకున్నా, మెరీనా అస్సలు తగ్గదు. తన మీద పడ్డ నిందలను భరిస్తూనే, తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కడసారి చూపు చూడనివ్వకపోయినా, అందరినీ ఎదిరించి మరీ శ్మశానానికి వెళ్లి తన ప్రియుడికి వీడ్కోలు పలుకుతుంది. ఎంతటి అవమానాలు ఎదురైనా తలవంచకుండా, ఒక ‘ఫెంటాస్టిక్ ఉమెన్’ లాగా తలెత్తుకుని నిలబడి, మళ్ళీ తన పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టడంతో కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : ప్రపంచం అంతాన్ని ఆపడానికి డెమి గాడ్ ఆపసోపాలు… మతిపోగోట్టే అడ్వెంచర్ డ్రామా

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×