OTT Movie : ఈ మూవీని చూస్తే చింత చచ్చినా పులుపు చావాదు అనే సామెత గుర్తుకు వస్తుంది. తొంభై ఏళ్ల వయసులో ఒక కన్య తో అనుభవాన్ని కోరుకుంటాడు ఒక మహానుభావుడు. రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదంటారు అందుకేనేమో. ఈ సినిమా అందరినీ ఆలోచనలో పడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
ఆపిల్ టివి (Apple TV) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘Memories of My Melancholy Whores’. ఈ మూవీ గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ రాసిన నవల ఆధారంగా, హెన్నింగ్ కార్ల్సెన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా స్పెయిన్, డెన్మార్క్, మెక్సికో కలసి నిర్మించాయి. ఇది ఒక 90 ఏళ్ల వృద్ధ జర్నలిస్ట్, తన కోరికను ఒక కన్య తో తీర్చుకోవాలని అనుకుంటాడు. అతను తన 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ అనుభవాన్ని కోరుకుంటాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ ఆపిల్ టివి (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఎల్ సాబియో అనే 90 ఏళ్ల జర్నలిస్ట్ తన జీవితంలో, ప్రేమను అనుభవించకుండా మిగిలిపోయిన వ్యక్తి గా ఉంటాడు. ఇంత వయసు వచ్చినా అతను వివాహం చేసుకోకుండా ఉంటాడు. తన జీవితంలో ఎక్కువగా, వేశ్యలతోనే సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని గడిపేస్తాడు. అయితే ఇప్పుడు తన 90వ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక కన్యతో ఒక రాత్రి గడపాలని బలంగా కోరుకుంటాడు. ఈ కోరికను నెరవేర్చడానికి అతను తన పాత స్నేహితురాలు, వేశ్యాగృహ యజమాని అయిన రోసా కాబార్కాస్ సహాయం తీసుకుంటాడు. రోసా అతని కోసం ఒక 14 ఏళ్ల డెల్గాడినా అనే అందమైన అమ్మాయిని సిద్ధం చేస్తుంది. ఈ అమ్మాయి తన కుటుంబానికి సహాయపడటానికి, తన కన్యత్వాన్ని అమ్ముకోవడానికి సిద్దపడి అక్కడికి వస్తుంది. మొదటి రాత్రి, డెల్గాడినా తాను వేసుకున్న మందు ప్రభావంతో నిద్రపోతుంది. ఎల్ సాబియో ఆమెతో గడపడానికి బదులు, ఆమె నిద్రిస్తున్నప్పుడు అందాన్ని చూసి మురిసిపోతాడు.
ఈ అనుభవం అతనిలో ఒక భావోద్వేగాన్ని తెస్తుంది. అతను తొలిసారిగా ప్రేమలో పడతాడు. ఈ సంఘటన తర్వాత ఎల్ సాబియో, డెల్గాడినా పట్ల ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆమె నిద్రలో ఉన్నప్పుడు, స్వచ్ఛమైన ఆమె అందం అతన్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది. అతను ఆమెను తన ఊహల్లో ప్రేమిస్తూ, ఆమెతో రొమాంటిక్ గా ఉన్నట్లు ఊహించుకుంటాడు. ఈ ప్రేమ అతని జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. అతను గతంలో ఎన్నడూ అనుభవించని ఒక అనుభూతిని పొందుతాడు. చివరికి డెల్గాడినా కూడా అతని పట్ల ఒక సానుభూతిని చూపిస్తుంది. ఈ అసాధారణ సంబంధం ఇద్దరి జీవితాలనూ మార్చేస్తుంది. చివరికి ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్తుంది ? ఆ అమ్మాయితో ఈ పెద్దాయన, ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.