Gundeninda GudiGantalu Today episode march 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. సరదాగా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతారు. సత్యం తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడతారు. అందరూ తమ ఫ్యామిలీ విషయాలు గురించి పంచుకుంటారు. సత్యం తన ఫ్రెండ్స్ తో సంతోషంగా గడుపుతాడు. అందరూ కలిసి ఆ రోజుల్లో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటారు. ఇక సత్యం తన కుటుంబాన్ని అందరినీ పరిచయం చేయగానే తన స్నేహితులు మూడు పువ్వులు ఆరు కాయలు అంటే మీ కుటుంబమే గుర్తొస్తుంది రా సత్యం అని అంటారు.. మా కుటుంబం ఇలాగే ఉమ్మడిగా ఉండాలని నా కోరిక నా కొడుకులును అలానే పెంచాను అని సత్యం గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటికే ఆలస్యమైంది అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మేం వెళ్ళొస్తామని చెప్పి అందరూ వెళ్లిపోతారు. ఇంటికి దగ్గరకొచ్చేసాం కదా ఇక అందరం నడుచుకుంటూ వెళ్లిపోదాం అని అంటాడు సత్యం. దానికి ప్రభావతి షాక్ అవుతుంది. నీకు అంతగా నడవలేకుంటే వెళ్ళు కార్లో వెళ్ళు అనేసి సత్యమంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఊర్లో అంత చూసుకుంటూ సరదాగా నడుచుకుంటూ అందరూ వెళ్లిపోతారు. శృతి మధ్యలో ఆవు పేడ మీద కాలు వేయడంతో రవి పై సీరియస్ అవుతుంది. చి చి అసలు ఏంటి తంతా రవి అని అంటుంది. మరేం పర్లేదు డబ్బుడమ్మ ఇంటికెళ్లేంతవరకు ఏ గడ్డికో కంప తుడుచుకొని వెళ్తే సరిపోతుంది అని బాలు అంటాడు. ఏంటి ఇంటి వరకు ఇలానే రావాలా అని శ్రుతి అనగానే ఏంటండీ మీరు ఊరుకోండి. ఇక్కడ వాటర్ ట్యాప్ ఉంది రా శృతి కాలు కడుక్కుందువని మీనా తీసుకుని వెళ్తుంది.. శృతి కాల్ కడుక్కుంటుంది ఇక అందరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు.
సుశీలమ్మ మాత్రం తన పని మనిషిని ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండనివ్వకుండా ఏదో ఒక పని చెప్పి విసిగిస్తూ ఉంటుంది ఇక ఆమె కూడా సుశీలమ్మకు కౌంటర్లు వేస్తూ ఉంటుంది. సుశీలమ్మ మాత్రం తన పని మనిషిని ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండనివ్వకుండా ఏదో ఒక పని చెప్పి విసిగిస్తూ ఉంటుంది. ఇక ఆమె కూడా సుశీలమ్మకు కౌంటర్లు వేస్తూ ఉంటుంది. కారు రావడం చూసి అగో వచ్చేసారు అని అంటుంది కానీ అందులో రాజేష్ రావడంతో అడుగుతుంది. వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు . నేను ఒక్కదాన్నే కార్ని తీసుకొని వచ్చాను అని రాజేష్ అంటాడు.
ఇక బాలు రాగానే శీలా డార్లింగ్ అంటూ సుశీలను ఎత్తుకొని తిప్పుతాడు. నన్ను ఎత్తుకొని తిప్పితే ఏమొస్తది రా నీ పెళ్ళాన్ని ఎత్తుకొని తిప్పు అనగానే మీనా వెళ్లి భయపడి వెనక్కి దాక్కుంటుంది. ప్రయాణం బాగా జరిగిందా అని సుశీల అందరిని అడుగుతుంది. అయితే మీనాని బాగా పొగుడుతుంది సుశీల అది చూసిన ప్రభావతి మూతి ముడుచుకుంటుంది. అయ్యో ప్రభావతి వచ్చావా నువ్వు రావని అనుకున్నాను కానీ వచ్చావే అని సుశీల వెటకారం అడుగుతుంది. నేను రాను అనంటే మీ అబ్బాయి ఊరుకునేలా లేడు అందుకే వచ్చాను అత్తయ్య అంటుంది.
ఇక ఊర్లోని వాళ్ళందరూ పలకరించడానికి వస్తారు ఈ క్రమంలో సత్యంని ప్రేమించిన ఒక అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. ఈ ముసల్ది మా వాళ్ళని గట్టిగా అడిగింటే నేను ఈపాటికి సత్యం కి భార్య అయ్యేదాన్ని అని బాధపడుతుంది. నీకోసం సున్నుండలు చేశాను సత్యం తీసుకొస్తాను అనేసి అంటుంది. అది చూసిన ప్రభావతి షాక్ అవుతుంది.. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ నాని తెగ పొగిడేస్తారు. మీ కోడలికి ఎంతున్నా మీనా లాంటి మంచి మనసు లేదు కదా ప్రభావతి అని అందరూ అంటారు. అది విన్న బాలు కరెక్ట్ గా చెప్పారు అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రోహిణి పై బాలు కన్నేస్తాడు ఆ మలేషియా మామ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో కనిపెడతానని మీనాతో అంటాడు.. ఇవన్నీ మనకెందుకులెండి మీ అమ్మను రోహిణి చూసుకుంటారు కదా అని అనగానే లేదు వద్దు అని మీనా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..