E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ అవతారమెత్తే పిల్లి… మస్ట్ వాచ్ క్రేజీ కొరియన్ డ్రామా

OTT Movie : అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ అవతారమెత్తే పిల్లి… మస్ట్ వాచ్ క్రేజీ కొరియన్ డ్రామా
Advertisement

OTT Movie : ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు ఎంత బాగుంటాయంటే… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపలేము. అందులోనూ ఇలాంటి కే డ్రామాల వచ్చాయంటే చూడకుండా ఉండలేం. అలాంటి ఓ అద్భుతమైన సిరీస్ గురించే ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ సిరీస్ లో ఒక పిల్లికి మానవుడిగా మారగల శక్తి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కథాంశం, కామెడీ, ప్రేమ, ఎమోషనల్ మూమెంట్స్ తో నిండిన ఒక లైట్-హార్టెడ్ కే డ్రామా ఇది. మంచి ఫీల్ గుడ్ సిరీస్ చూడాలనుకునే వారు వర్త్ వాచింగ్ మావా అనాల్సిందే. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

స్టోరీలోకి వెళితే 

Advertisement

హీరోయిన్ కిమ్ సోల్-ఆ ఒక యంగ్ గ్రాఫిక్ డిజైనర్. ఆమె వెబ్‌టూన్ ఆర్టిస్ట్ కావాలని కలలు కంటుంది. ఆమెకు పిల్లులంటే ఆమెకు పిల్లులు అంటే ఇష్టం మాత్రమే కాదు ద్వేషం కూడా. ఈ క్రమంలోనే ఓ ఫ్రెండ్లీ పిల్లిని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ తెల్ల పిల్లి పేరు సెర్గీ. హీరోయిన్ మాజీ ప్రేమికుడు లీ జే-సన్ స్నేహితురాలిది ఆ పిల్లి. జే-సన్‌కు పిల్లులు అంటే అలర్జీ ఉండటం వల్ల, అతను సోల్-ఆను ఈ పిల్లిని చూసుకోమని కోరుతాడు. సోల్-ఆ ఈ పిల్లికి “హాంగ్-జో” అని కొత్త పేరు పెడుతుంది.

కానీ హాంగ్-జో సాధారణ పిల్లి కాదు. దానికి మనిషిలా మారే శక్తి ఉంటుంది. సోల్-ఆ దగ్గర ఉన్నప్పుడు లేదా ఆమె వస్తువులతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే మారగలడు. సోల్-ఆ పిల్లి మనిషిలా మారినప్పుడు చూసి, అతను తన ల్యాండ్‌లార్డ్ కొడుకు అని అనుకుంటుంది. అంతేకాదు అతనితో కలిసి జీవించడం మొదలు పెడుతుంది. ఇక హాంగ్-జో సోల్-ఆపై ప్రేమను పెంచుకుంటాడు ఆమె దగ్గర ఉండటానికి, తన సీక్రెట్ ను రహస్యంగా ఉంచడానికి చాలా కష్టపడతాడు.

Advertisement

సోల్-ఆ గతంలో జే-సన్‌తో ఉన్న సంబంధం వల్ల హర్ట్ అవుతుంది. ఎందుకంటే జే-సన్ ఆమెను అకస్మాత్తుగా విడిచిపెట్టాడు. హాంగ్-జో ఆమెకు గత గాయాల నుండి కోలుకోవడానికి సహాయం చేస్తాడు. ఇక అతను ఆమెను రక్షించడానికి, సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ ఆమె పక్కనే ఉంటాడు. ఈ క్రమంలో సోల్-ఆ, హాంగ్-జో మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుంది. కానీ హాంగ్-జో సీక్రెట్ వీళ్ళ రిలేషన్ కు అడ్డుగా మారుతుంది. మరి హీరోయిన్ కి హీరో అసలు నిజం ఏంటో చెప్పాడా? విషయం తెలిసిన తరువాత ఆమె ఏం చేసింది ? చివరికి ఏం జరిగింది? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘మియావ్, ది సీక్రెట్ బాయ్’ (Meow the secret boy korean series) అనేది 2020లో విడుదలైన దక్షిణ కొరియా ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ టెలివిజన్ సిరీస్. గో అ-రా రాసిన 2009–2010 నావర్ వెబ్‌టూన్ “వెల్‌కమ్” ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ సిరీస్‌లో కిమ్ మ్యుంగ్-సూ (ఎల్), షిన్ యే-యున్, సియో జి-హూన్, యూన్ యే-జూ, కాంగ్ హూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జియో సినిమా (Jio Cinema) లేదా యాపిల్ టీవీ ఓటీటీలో ఈ సిరీస్ ను చూడొచ్చు.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×