Marriage Incentive: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యారేజ్ చేసుకున్న ఆ దంపతులకు ఉచితంగా లక్ష రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతకీ ఆ స్కీమ్ విధి విధానాలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు దీనికి అర్హులు అన్న డీటేల్స్‌పై ఓ లుక్కేద్దాం.
తెలంగాణ ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారికి లక్ష ప్రోత్సాహక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే దివ్యాంగులు ఊహించని తీసికబురు. గతంలో ఉన్న ఈ పథకానికి తుది మెరుగులు దుద్దింది. ఆపై ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరి ఈ లక్ష రూపాయలు ఎవరికి ఇస్తారు? వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా ఆ డబ్బు అకౌంట్లలో జమ చేస్తారు? ఇలాంటి సందేహాలన్నింటికీ ఇక్కడ సమాధానం పొందండి. ఈ పథకం గతంలో ఉన్నదే. కాకపోతే చాలా సమస్యలు ఉండేవి. వాటిని కాంగ్రెస్ సర్కార్ సరిచేసింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దివ్యాంగ వ్యక్తి- దివ్యాంగ సమస్య లేని వ్యక్తికి మధ్య వివాహం జరిగితే మాత్రమే లక్ష రూపాయలు ఇచ్చేది. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే సహాయం చేయలేదు. దీనివల్ల చాలామంది లేని సమస్యలు ఎదుర్కొన్నారు. అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ స్కీమ్ గురించి ప్రభుత్వానికి చాలామంది ఫిర్యాదులు చేశారు.
ALSO READ: భారీ వర్షాలు.. బెంగుళూరులో రెడ్ అలర్ట్, మరి హైదరాబాద్ ?
పరిస్థితి గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ చేసిన తప్పును సరి చేస్తూ కొత్తగా ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష ఆర్థిక సాయం లభించనుంది. ఈ పథకం కింద లక్ష సాయం భార్య పేరున ప్రభుత్వం ఇవ్వనుంది.
దరఖాస్తుదారులలో కనీసం ఒకరు వైద్య బోర్డు జారీ చేసిన దివ్యాంగత్వ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అప్లై చేసినవారు తెలంగాణ నివాసి కావాలి. వారికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేయనుంది. ఈ పథకం కింద 2018 వరకు కేవలం 50 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఆ తర్వాత ఆర్థిక సాయాన్ని లక్షకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఎక్కువ మంది లబ్ది చేకూరనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవడం వెనక మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఈ స్కీమ్ గురించి తెలుసుకున్న ఆమె, ఏ విధంగా చెయ్యాలో అధికారులతో మాట్లాడారు. సరి చేయాల్సిన సమయం ఆసన్నమైందని సూచన చేశారు. పథకంలో లోటు పాట్లను పరిశీలించి ప్రభుత్వం కొత్తగా ఆయా మార్పులు చేసింది.
వెంటనే వాటికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయింది. మహిళల విషయంలో మంత్రి సీతక్క జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్ అధికారుల్లో బలంగా ఉంది. వారికి అన్నిరకాలుగా ప్రయోజనాలు కలిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి సీతక్క నిర్ణయంపై మహిళల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది.