E-Paper
Advertisement

ఫ్రెండ్ అంత్యక్రియలకు వచ్చి అండర్‌వరల్డ్‌లోకి… 33 కోట్లు కొట్టేయడానికి దిమ్మతిరిగే ప్లాన్

ఫ్రెండ్ అంత్యక్రియలకు వచ్చి అండర్‌వరల్డ్‌లోకి… 33 కోట్లు కొట్టేయడానికి దిమ్మతిరిగే ప్లాన్
Advertisement

Action Crime Heist Movie: ఫ్రెండ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సొంత ఊరికి తిరిగొచ్చిన ఓ మాజీ ఫైటర్… అక్కడి పరిస్థితులు చూసి మళ్లీ తాను వదిలేసిన క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెడితే ? పైగా తన గాడ్‌సన్‌తో కలిసి ఓ పవర్‌ఫుల్ మాబ్ బాస్ దగ్గరున్న భారీ మొత్తాన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తే ? యాక్షన్, క్రైమ్, హీస్ట్ అంశాలతో తెరకెక్కిన అమెరికన్ మూవీ ‘అట్లాస్ కింగ్’ (Atlas King) ఇదే కాన్సెప్ట్‌తో సాగుతుంది. మరి ఆ మాజీ ఫైటర్ ఎవరు ? మళ్లీ అండర్‌వరల్డ్‌లోకి ఎందుకు వెళ్లాడు? మాబ్ బాస్ నుంచి డబ్బు కొట్టేయాలన్న ప్లాన్ ఎలా సాగింది ? మూవీ తెలుగులో అందుబాటులో ఉందా ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

అట్లాస్ కింగ్ ఒకప్పుడు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ఫైటర్. అయితే కొంతకాలంగా తన పాత జీవితానికి, క్రైమ్ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కానీ అతని సన్నిహితుడు డచ్ మరణించడంతో అంత్యక్రియల కోసం సొంత నగరానికి తిరిగి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత డచ్ కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుంటాడు. డచ్ కొడుకు టామీ కూడా తన తండ్రి బాటలోనే అండర్‌గ్రౌండ్ ఫైట్ ప్రపంచంలోకి వెళ్లాలని చూస్తుంటాడు. కానీ నగరంపై క్రూరమైన క్రైమ్ బాస్ క్లే ఎమర్సన్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంటాడు.

Advertisement

ఫైటింగ్ నుంచి క్రైమ్ వరకు అతని మాటే చెల్లుతుంది. టామీ కూడా అతని ప్రభావంలోకి వెళ్లే ప్రమాదం రావడంతో అట్లాస్ ఇక మౌనంగా ఉండలేకపోతాడు. తాను వదిలేసిన జీవితంలోకి తిరిగి వెళ్లడం ఇష్టం లేకపోయినా, టామీని కాపాడేందుకు అట్లాస్ మళ్లీ అండర్‌ వరల్డ్‌ లోకి అడుగు పెడతాడు. అయితే క్లేను కేవలం బలంతో ఎదుర్కోవడం సాధ్యం కాదని అతనికి అర్థమవుతుంది. అందుకే టామీతో కలిసి క్లే ఆర్థిక సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకుంటాడు.

ఇక్కడి నుంచే అసలు హీస్ట్ మొదలవుతుంది. క్లేకు చెందిన 33కోట్ల భారీ మొత్తాన్ని దొంగిలించి, అతని పట్టు నుంచి బయటపడాలని అట్లాస్, టామీ ప్లాన్ చేస్తారు. కానీ వాళ్లు ఎదుర్కొనేది సాధారణ గ్యాంగ్ కాదు. నగరంలోని ప్రతి మూలలో క్లే మనుషులు ఉంటారు. చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ప్రమాదం. ఒకవైపు క్లే గ్యాంగ్ నుంచి తప్పించుకోవాలి. మరోవైపు అట్లాస్ తన పాత శత్రుత్వాలను ఎదుర్కోవాలి. టామీని కూడా కాపాడాలి. ఈ క్రమంలో హీస్ట్ ప్లాన్ అనుకున్నదానికంటే ప్రమాదకరంగా మారుతుంది. అట్లాస్ తన గతాన్ని నిజంగా వదిలించుకోగలడా ? క్లే సామ్రాజ్యాన్ని కూల్చి డచ్ కుటుంబాన్ని కాపాడగలడా? అనేదే కథలో చూడాల్సిన అసలైన సస్పెన్స్.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

Advertisement

నిజ జీవితంలో UFC హాల్ ఆఫ్ ఫేమర్ అయిన మైఖేల్ బిస్పింగ్ అట్లాస్ కింగ్ పాత్రలో నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆయనతో పాటు క్యూబా గుడింగ్ జూనియర్, జార్జ్ ఫిన్, సారా వేన్ కాలీస్ కీలక పాత్రల్లో నటించారు. నికా అగియాష్విలి దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు 1 గంట 30 నిమిషాల నిడివితో ఉంటుంది. ఫైట్ సీన్స్, క్రైమ్, హీస్ట్, అండర్‌వరల్డ్ వార్‌తో కథ వేగంగా సాగుతుంది. ముఖ్యంగా అట్లాస్, క్లే మధ్య జరిగే తుది పోరాటం సినిమాకు కీలకమైన హైలైట్‌గా నిలుస్తుంది. ‘అట్లాస్ కింగ్’ ప్రస్తుతం Apple TVలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌ ఆడియోలో అందుబాటులో ఉంది.

Read Also: కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×