Gambhir in Ramba Oorvasi Menaka: అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రంభ ఊర్వశి మేనక ( Ramba Oorvasi Menaka) పేరుతో కామెడీ పంట పండించేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో 1977లోనే ఇదే టైటిల్ తో సినిమా వచ్చి సక్సెస్ అయింది. అదే పాత టైటిల్ తో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ సృష్టించేందుకు అల్లరి నరేష్ సిద్ధమయ్యాడు. సరికొత్త సోషియో ఫాంటసీ కామెడీ సినిమాగా రాబోతుంది. అయితే ఈ మూవీలో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అల్లరి నరేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రంభ ఊర్వసి మేనక. సురభి, రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ లాంటి అంద గత్తెలు ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ నటించిన ఉన్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తీసుకువస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైంది.
అల్లరి నరేష్ హీరోగా చేసిన రంభ ఊర్వశి మేనక సినిమాలో గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులో గౌతమ్ గంభీర్ గురించి అల్లరి నరేష్ అదిరిపోయే డైలాగ్ కొడతాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా డైలాగ్ చెప్పిన అనంతరం.. గౌతమ్ గంభీర్ అంటూ వీర లెవెల్ లో రెచ్చిపోతాడు అల్లరి నరేష్.
దీంతో గౌతమ్ గంభీర్ ను కూడా అల్లరి నరేష్ బాగా వాడుకున్నాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
అంతేకానీ అతని క్యారెక్టర్ మాత్రం ఇందులో లేదు. కేవలం డైలాగ్ కోసం మాత్రమే గౌతమ్ గంభీర్ ను అల్లరి నరేష్ బాగా వాడేసాడు. గతంలో జరిగిన ఇంటర్వ్యూలలో గౌతమ్ గంభీర్ అంటే తనకు ఇష్టమని… ఖచ్చితంగా అతడి పాత్రను తాను వాడుకుంటాడని చెప్పాడట. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చేసి చూపించాడు.
ఇది ఇలా ఉండగా టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఉన్న గౌతమ్ గంభీర్… జట్టు విజయాల కోసం చాలా కష్టపడుతున్నారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం, టీమిండియా కు ఎన్నో విజయాలను అందించాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దక్కింది. ఇక మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో కూడా టీమిండియాను ఛాంపియన్ గా నిలిపాడు గంభీర్.