E-Paper
Advertisement

కొమరం కన్నీళ్ల వెనుక ఇంత కథ ఉందా !

కొమరం కన్నీళ్ల వెనుక ఇంత కథ ఉందా !
Advertisement

Komaram Background: జబర్దస్త్ తో పాటు ఎన్నో యూట్యూబ్ వీడియోలలో లేడీ గెటప్ లు వేసి నవ్వించిన కొమరక్క అలియాస్ కొమరం గురించి తెలీని వారు లేరంటే ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు టీవీషోలు, యూట్యూబ్ వీడియోలు చేసిన కొమరం సినిమాలు కూడా ఎన్నో చేశాడు.

కానీ తాజాగా ఇరుముడిలో చేసిన నాగులు అనే క్యారెక్టర్ మంచి అప్లాజ్ తెచ్చుకోవడంతో ఇపుడు ఎక్కడ చూసిన కొమరం పేరే మారుమ్రోగిపోతుంది.మరి కొమరం బ్యాక్ గ్రౌండ్ ఏంటో అసలీపేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం !

కొమరం బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే

Advertisement

కొమరక్క ఆలియాస్ కొమరం విషయానికి వస్తే.. పుట్టింది తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో. కొమరం అసలు పేరు కుమార్. చిన్నప్పటి నుండి అష్టకష్టాలు పడుతూ గ్రామంలోనే పదోతరగతి పూర్తీ చేసిన కుమార్ హైదరాబాద్ కి వచ్చి చేయని పనంటూ లేదు.వచ్చిన మొదట్లో ఒక హోటల్లో కుదురుకున్న కుమార్ అక్కడే దాదాపు ఎనిమిదేళ్ళు పని చేయడం గమనార్హం.

also read :టాక్సిక్‌కు టికెట్ రేట్లు పెంచేశారు.. ఎంతంటే?

బాత్ రూమ్ లు కూడా కడిగా 

Advertisement

ఇక అక్కడ పని చేస్తుండగా కుటుంబంలో ఆర్ధిక పరిస్థితులు మరింత దిగజారడంతో పెద్ద మొత్తంలో బస్తాలు మోసే హమాలీ పని కూడా చేసేవాడట, అందుకు నెలకి దాదాపు 4,500వరకు సంపాదించేవాడినని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఇక ఒక్క హోటల్లోనో,లేక హమాలీ పనో కాదని రోడ్లపై గొడుగులు, పర్సులు, బ్యాగులు,నైటీలు ఇలా ఏది గిట్టుబాటు అవుతుంది అంటే అది అమ్మేవాడినని తెలిపాడు.అంతే కాకుండా నామోషీ అని అనుకోకుండా బాత్ రూమ్ లు కూడా కడిగానని కొన్ని సందర్భాలలో ఓపెన్ అయిపోయాడు.

 కొమరక్కగా ఎలా మారిందంటే 

ఇక తనకి నటన అంతే ఎంతో ఇష్టమని,ఇండస్ట్రీలో వేషాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన భార్యే టైలరింగ్ చేస్తూ తనకి డబ్బులు పంపేదని భార్య తనని ఏవిధంగా ప్రోత్సహించిందో తెలిపాడు. అయితే తనకున్న మిమిక్రి టాలెంట్ తో మొదట్లో టీవీల్లో అడుగుపెట్టి జబర్దస్త్ తో పాపులారిటీ దక్కించుకున్నానని ఆరోజుల్ని గుర్తుచేసుకున్నాడు.ఇక నవీన్ అనే పేరు కాస్తా కొమరక్క ఎలా మారిందనే విషయం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. ఆందోల్ మాజీ mla క్రాంతి కిరణ్ గారి తల్లి పేరు కొమరమ్మ అని ,తను ఆమె పేరుని ఆధారంగా చేసుకునే పెట్టుకున్నాని తెలిపాడు.

ఎంకరేజ్ చేసింది మాత్రం  కిర్రాక్ ఆర్పీనే 

అయితే ఏ పాత్రలు వేసినా దక్కని గుర్తింపు మహిళా వేషాలతో దక్కిందని, ఇక ఆ పాత్రలోనే తనకి పూర్తి స్వేచ్చ లభించినట్టు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనకి జబర్దస్త్ లో ఎక్కువగా అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేసింది కిర్రాక్ ఆర్పీ అని, ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్ళపాటు తన టీమ్ లో పెట్టుకొని అవకాశాలు ఇచ్చాడని పలు మార్లు గుర్తు చేసుకున్నాడు.

తనకి 200 కోట్ల ఆస్తి

ఇక గతంలో తనకి 200 కోట్ల ఆస్తి ఉందనే రూమర్స్ పై గతంలోనే క్లారిటీ ఇచ్చాడు కుమార్ ఆలియాస్ కొమరక్క. తమకి గతంలో కొంత భూమి ఉండేదని,అది అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో పాటు సంపాదించిన డబ్బుని శంషాబాద్ ప్రాంతాలలో పెట్టుబడి పెట్టానని, అదే కాస్తో కూస్తో విలువ పెరిగింది తప్ప తనకి 200 కోట్ల ఆస్తి ఉందనే మాట కేవలం ఫేక్ ప్రచారమే అని ఖండించాడు.

ఇక టీవీ షోలతో పాటు దాదాపు నలబై సినిమాల్లో నటించానని కాని ఏదీ తనకి పెద్దగా గుర్తింపు తేలేదని, దసరా కాస్త పేరు తెస్తే, ఇప్పుడు వచ్చిన ఇరుముడి తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని తెలిపాడు. ముఖ్యంగా ఇపుడు అందరు తనని కొమరక్కగా కాకుండా ఈ సినిమాలో చేసిన నాగులు అనే పాత్ర పేరుతోనే గుర్తు పెట్టుకోవాలని తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు.

also read :తండ్రి మొదటి కారు కోసం విష్ణు మంచు ఇంత చేశాడా?

14 ఏళ్ళుగా పడుతున్న కష్టాలకి ఇరుముడి బ్రేక్ 

మొత్తానికి దాదాపు 14 ఏళ్ళుగా పడుతున్న కష్టాలకి ఇరుముడి సినిమా ఎండ్ కార్డ్ వేసిందన్న మాట. చూడాలి మరి ఇప్పుడే మంచి క్రేజ్ దక్కించుకుంటున్న కొమరక్క ఆలియాస్ నాగులు ముందు ముందు ఇంకెన్ని మంచి సినిమాలు ఖాతాలో వేసుకుంటాడో !

Tags

Related News

ఫస్ట్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగు పెట్టిన శివ కుమార్…

దీప్తి సునైన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. స్టెప్పులు అదుర్స్!వీడియో వైరల్

బూతులు మాట్లాడకపోతే నీతిమంతులా… అపూర్వ పై శివాజీ ఫైర్!

పవన్ తో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి!

ఒక్కో ఈవెంట్‌కు లక్షల్లో పారితోషికం.. స్టార్ యాంకర్ల రేంజే వేరు!

బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!

బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

Big Stories

Advertisement
×