Netflix Mystery Thriller Series : మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ లు ఇప్పుడు OTTలో భారీగా ట్రెండ్ అవుతున్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఒక సూపర్ హిట్ సిరీస్ “ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్” (A Good Girls Guide to Murder Season 2) సీజన్ 2. మొదటి సీజన్ సూపర్ హిట్ కాగా, రెండవ సీజన్ కూడా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానాల్లో నిలిచింది. మరి ఈ సిరీస్ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఈ సిరీస్ ఇంగ్లాండ్ లోని ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో సాగుతుంది. అక్కడ జరిగిన 17 ఏళ్ల అమ్మాయి హత్య చుట్టూ తిరుగుతుంది. మొదటి సీజన్ లో పిప్ ఫిట్జ్ (ఎమ్మా మైయర్స్) ఆ హత్యను ఛేదించడానికి తన స్వంతంగా దర్యాప్తు చేసి, నిజం బయట పెట్టింది. రెండవ సీజన్ కథ ఐదు సంవత్సరాలు ముందుకు సాగుతుంది. తన వైరల్ ట్రూ-క్రైమ్ పాడ్ కాస్ట్ తర్వాత డిటెక్టివ్ పని వదిలేస్తానని శపథం చేస్తాడు పిప్. ఇప్పుడు మళ్లీ ఒక కొత్త సవాలును ఎదుర్కొంటుంది. అసలు హంతకుడిని పూర్తిగా బయట పెట్టాలని నిర్ణయించుకుని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి అడుగు పెడుతుంది. కొత్త ట్విస్టులు, ఉత్కంఠ, సస్పెన్స్ తో ఈ సీజన్ ముందుకు సాగుతుంది.
Also Read : ‘గుల్లక్’ సిరీస్ నుండి అన్ను భయ్యాను ఎందుకు తొలగించారో తెలుసా ?
ప్రధాన పాత్రలో ఎమ్మా మైయర్స్… వెడ్నెస్ డే సిరీస్ లో ఎనిడ్ గా నటించిన నటి అద్భుతంగా నటించింది. జైన్ ఇక్బాల్, ఆశా బ్యాంక్స్, హెన్రీ ఆష్టన్, కార్లా వుడ్‌కాక్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆరు ఎపిసోడ్ లతో వచ్చిన ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్ ముగిసేటప్పటికి మరింత ఉత్కంఠ పెంచుతుంది.
Also Read : స్పోర్ట్స్ అంటే చెవికోసుకుంటారా ? హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు మీకోసమే
మొదటి సీజన్ భారీ విజయం సాధించినందున రెండవ సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కథలో ఉన్న ట్విస్టులు, స్మార్ట్ రైటింగ్, బలమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మే 27న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సీజన్ నాలుగు రోజుల్లోనే టాప్ 10లో 5వ స్థానానికి చేరుకుంది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు ఇది మస్ట్ వాచ్ సిరీస్. ఒక్క ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపలేరు. ప్రశాంతమైన పట్టణంలో దాగి ఉన్న చీకటి రహస్యాలు, హత్యల వెనుక ఉన్న నిజాలు… అన్నీ ఈ సీజన్ లో బయట పడతాయి.