E-Paper
Advertisement

పెళ్లి నుంచి లేచిపోడానికి ప్లాన్ చేసే జంట.. అనుకోకుండా బయటపడే సీక్రెట్‌తో హంగామా!

పెళ్లి నుంచి లేచిపోడానికి ప్లాన్ చేసే జంట.. అనుకోకుండా బయటపడే సీక్రెట్‌తో హంగామా!
Advertisement

Malayalam Romantic Comedy : పెళ్లి అంటే జీవితాంతం కలిసి ఉండాలనే నిర్ణయం. కానీ పెళ్లి జరిగిన రాత్రే భార్యాభర్తలిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తే… అంతేకాదు పారిపోతున్న సమయంలో అనుకోకుండా కోట్ల రూపాయల డ్రగ్స్, డబ్బు ఉన్న కారులోకి అడుగు పెడితే… ఆ తర్వాత క్రిమినల్స్, పోలీసులు వెంటపడుతుంటే… ఒకరినొకరు అసలు ఇష్టపడని ఆ జంట మధ్యే ప్రేమ పుడితే ? ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల చుట్టూ తిరిగే కామెడీ క్రైమ్ రొమాంటిక్ మూవీ ‘మోధ రాతిరి’ (Modha Rathiri). మరి ఈ మలయాళం మూవీ తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ?

కథలోకి వెళ్తే…

చెన్నైలో సంప్రదాయ కుటుంబాల మధ్య పెరిగిన విక్రమ్, అనన్యకు ఒకరంటే ఒకరికి పెద్దగా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఎప్పుడూ కలవవు. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడి, పెద్దల మాట కాదనలేని పరిస్థితి కారణంగా ఇద్దరూ పెళ్లికి ఒప్పుకుంటారు. పెళ్లి జరిగిపోయిన తర్వాత కూడా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టేమీ ఉండదు. పైగా శోభనం రోజు నుంచే తమ తమ దారుల్లో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. విక్రమ్ తన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి తప్పించుకునే ప్లాన్ వేస్తాడు.

Advertisement

మరోవైపు అనన్య కూడా తన ప్రియుడితో వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఇద్దరూ ఒకేసారి కిటికీ వైపు చేరుకుంటారు. ఇక్కడే కథ మొత్తం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒకరికి తెలియకుండా మరొకరు పారిపోతున్న విషయం ఇద్దరికీ తెలిసిపోతుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అదే సమయంలో ఒక క్రైమ్ సిండికేట్‌కు చెందిన కారులోకి అనుకోకుండా వీరు చేరాల్సి వస్తుంది. ఆ కారులో ఉన్న సరుకు సాధారణమైనది కాదు. కోట్ల విలువ చేసే అక్రమ డ్రగ్స్‌తో పాటు భారీ మొత్తంలో డబ్బు కూడా అందులో ఉంటుంది.

తమకు తెలియకుండానే పెద్ద క్రిమినల్ వ్యవహారంలో చిక్కుకున్న విక్రమ్, అనన్యలను డ్రగ్ మాఫియా వదిలిపెట్టదు. రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు కూడా అనుమానంతో వారి వెంటపడతారు. నగరంలోని రోడ్లు, సందులు, చీకటి ప్రాంతాలు.. ఇలా ఒక్క రాత్రిలోనే ఈ కొత్త జంటకు ఎదురయ్యే పరిస్థితులు వరుసగా నవ్వులు తెప్పిస్తూనే టెన్షన్ పెంచుతాయి. అయితే ఈ పరుగుపందెంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. ఎప్పుడూ గొడవపడే విక్రమ్, అనన్య ఒకరి కోసం మరొకరు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రమాదాల మధ్య ఒకరి మనస్తత్వం మరొకరికి అర్థమవుతుంది. మరి ఈ రాత్రి ప్రయాణం వాళ్ల పెళ్లిని కాపాడుతుందా ? లేక ఉదయం అయ్యేసరికి ఇద్దరూ పూర్తిగా వేరే దారుల్లో వెళ్లిపోతారా ? క్రిమినల్స్ నుంచి తప్పించుకోగలరా ? ఈ రాత్రి వారి జీవితాలను ఎలా మార్చేస్తుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

‘మోధ రాతిరి’ మూవీలో జీవా (Jiiva), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ రొమాంటిక్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంది. రొమాంటిక్ కామెడీ సినిమాలను చూడాలి అనుకునే వారికి ఇది మంచి టైమ్‌పాస్ వాచ్‌గా అనిపించొచ్చు.

Read Also: గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

Tags

Related News

అమ్మాయిని 6 దాటితే కలవకూడదనే వింత కండిషన్.. రూపం మార్చే ఈవిల్ మిస్టరీ

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఏకంగా 13 స్ట్రీమింగ్..!

ఏకంగా ఆఫీసులో బాస్ తోనే.. తెలుగులో సూపర్ హిట్ కొరియన్ రొమాంటిక్-కామెడీ సిరీస్

రైల్వే తత్కాల్ టికెట్ల స్కామ్.. పోలీసులకి కంటిమీద కునుకు లేకుండా చేసే మాఫియా

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

Big Stories

Advertisement
×