The Fixers Taiwanese Series: ఒకప్పుడు అండర్ వరల్డ్‌లో పేరు తెచ్చుకున్న గ్యాంగ్‌స్టర్… ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుని సాధారణ జీవితాన్ని గడపాల్సి వస్తే ? అనుకోకుండా వందేళ్ల నాటి ఓ రహస్య సంస్థలోకి అడుగు పెట్టాల్సి వస్తే ? అక్కడ అతనికి అస్సలు పడని వ్యక్తినే పార్ట్‌నర్ గా ఇచ్చి, పెద్ద పెద్ద క్రిమినల్స్, రాజకీయ నాయకుల సమస్యలను పరిష్కరించమంటే ? ఆ మిషన్ల మధ్య మరో శత్రు ముఠా మొత్తం వ్యవస్థనే నాశనం చేయడానికి వస్తే ? ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన తైవానీస్ యాక్షన్-కామెడీ క్రైమ్ సిరీసే ‘ది ఫిక్సర్స్: సీజన్ 1’ (The Fixers: Season 1). మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఫెలిక్స్ చియాంగ్ అలియాస్ చియాంగ్ ఫు-షెంగ్ ఒకప్పుడు అండర్ వరల్డ్‌లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న గ్యాంగ్‌స్టర్. కానీ కాలం మారడంతో అతని పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుంది. అప్పుల్లో కూరుకుపోయి, జీవితంలో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో మిడ్-లైఫ్ క్రైసిస్‌తో సతమతమవుతుంటాడు. పాత రోజుల్లో ఉన్న పవర్, పలుకుబడి ఏవీ ఇప్పుడు అతని దగ్గర ఉండవు. అలాంటి సమయంలో అనుకోకుండా అతను చింగ్ హే అనే రహస్య సంస్థతో ఘర్షణలో చిక్కుకుంటాడు. బయటకు పురాతన ఆలయంలా కనిపించే చింగ్ హే టెంపుల్ వెనుక నడిచే వ్యవహారం మాత్రం చాలా పెద్దది.
వందేళ్లుగా గుట్టుగా కొనసాగుతున్న ఈ సంస్థ… నేరగాళ్లు, రాజకీయ నాయకులు, బిజినెస్ ఎలైట్స్ చట్టం ముందు చిక్కుకోకుండా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆశ్రయించే ఒక రహస్య నెట్‌వర్క్‌లా పని చేస్తుంటుంది. సమస్యల్లో చిక్కుకున్న వాళ్లకు పరిష్కారం చూపించే ఈ సంస్థలో ఫెలిక్స్ కూడా అనుకోకుండా ఓ ‘ఫిక్సర్’గా మారాల్సి వస్తుంది. కానీ అక్కడ అతనికి ఇచ్చే పార్ట్‌నర్ తో సమస్య మొదలవుతుంది. లూయిస్ హ్స్యూ ఓ రాజకీయ నాయకుడి కుమారుడు. అహంకారం, తొందరపాటు, తనదైన ఆలోచనా విధానం ఉన్న అతనికి ఫెలిక్స్ కు ఏమాత్రం పొంతన ఉండదు. అయినా ఇద్దరూ కలిసి ఒక్కో మిషన్ ను పూర్తి చేయాల్సి వస్తుంది.
వీరి మధ్య గొడవలు, వాదనలు ఒకవైపు సాగుతుంటే… మీనా షెన్ అనే మిస్టరీ మహిళ రంగంలోకి దిగుతుంది. ఆమె ఉనికి ఈ ఫిక్సర్ల మిషన్లను మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. ఇంతలో చింగ్ హేకు వందేళ్లుగా ప్రత్యర్థిగా ఉన్న యే యు టోంగ్ అనే నైట్ మూన్ హాల్ కూడా కదులుతుంది. శత్రువులందరినీ ఒక్కచోట చేర్చి చింగ్ హే సామ్రాజ్యాన్నే కూల్చేయాలని భారీ ప్లాన్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఒకరినొకరు భరించలేని ఫెలిక్స్, లూయిస్ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి చేతులు కలపాల్సి వస్తుందా ? చింగ్ హే టెంపుల్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? మీనా షెన్ అసలు ఎవరి వైపు ఉంది ? శత్రువుల దాడి నుంచి ఈ వందేళ్ల వ్యవస్థ బయటపడుతుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.
‘ది ఫిక్సర్స్ సీజన్ 1’ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో మొత్తం 10 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఒరిజినల్ మాండరిన్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. క్రైమ్, యాక్షన్, కామెడీతో పాటు టెంపుల్ కల్చర్, అండర్‌వరల్డ్ నేపథ్యాన్ని కలిపిన ఈ తైవానీస్ సిరీస్ కథ మూవీ లవర్స్ కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Read Also: జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా