Upcoming Malayalam Movies —: ఓటీటీలో మలయాళం సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూసే వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఈ నెలలో ప్రేక్షకులను అలరించడానికి IMDB లో టాప్ రేటింగ్ ఉన్న సినిమాలు, ఈ నెలలో ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ సినిమాల పేర్లు, వాటి వివరాల గురించి తెలుసుకుందాం పదండి.
‘Bazooka’
2025లో విడుదలైన ఈ మలయాళ యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్ మూవీకి డీనో డెన్నిస్ దర్శకత్వం వహించారు. ఇందులో మమ్మూట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హక్కీం షా, షైన్ టామ్ చాకో, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఒక “గేమింగ్ థ్రిల్లర్”గా ప్రచారం చేయబడింది. ఇది ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక పోలీసు అధికారి, ఒక ఫోరెన్సిక్ నిపుణుడు కలిసి చేసే క్యాట్-అండ్-మౌస్ గేమ్‌ను చూపిస్తుంది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ZEE5లో OTT లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. 154 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 7.6/10 రేటింగ్ ఉంది.
‘Aabhyanthara Kuttavaali’
2025లో విడుదలైన ఈ మలయాళ కామెడీ-థ్రిల్లర్ మూవీకి సేతునాథ్ పద్మకుమార్ దర్శకత్వం వహించారు. అసిఫ్ అలీ, జగదీష్, హరిశ్రీ అశోకన్, తులసి, సిద్ధార్థ్ భరతన్, ఆనంద్ మన్మధన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం IPC సెక్షన్ 498A (గృహహింస మరియు వరకట్న వేధింపులపై చట్టం) దుర్వినియోగం గురించి, ఒక వివాహితుడైన పురుషుడు ఎదుర్కొనే న్యాయపరమైన సంఘటనలను చూపిస్తుంది. ఈ చిత్రం 2025న జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. Zee ఓటీటీలోకి త్వరలో రాబోతోందని సమాచారం. ఈ సినిమాకి IMDbలో 7.3/10 రేటింగ్ ఉంది .
‘Ronth’
2025లో విడుదలైన మలయాళ క్రైమ్-థ్రిల్లర్ సినిమాకి షాహి కబీర్ దర్శకత్వం వహించారు. ఇందులో దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మీ మీనన్, కృష్ణ కురుప్, సుధీ కొప్పా సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కేరళలోని కన్నూర్‌లోని ధర్మశాల పోలీసు స్టేషన్‌లో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకూడా జులై రెండవ వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.122 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 8.6/10 రేటింగ్ ఉంది. జులై నెలలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
‘Janaki v/s State of Kerala’
2025లో విడుదల కావాల్సిన ఈ మలయాళ కోర్ట్‌రూమ్ డ్రామాకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో సురీష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైజు సంతోష్, మాధవ్ సురేష్, దివ్య పిళ్ళై, అస్కర్ అలీ, శృతి రామచంద్రన్, శోభి తిలకన్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జె. ఫణీంద్ర కుమార్ నిర్మాణంలో కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. కేరళ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుంది. సురీష్ గోపి ఇందులో న్యాయవాదిగా నటించాడు. ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) ఆంక్షల కారణంగా, విడుదల వాయిదా పడింది.
‘Sarkeet’