BigTV English

Mgnrega Workers: ఏపీలో వారికి పండగే.. అకౌంట్‌‌ల్లోకి డబ్బులు జమ

Mgnrega Workers: ఏపీలో వారికి పండగే.. అకౌంట్‌‌ల్లోకి డబ్బులు జమ

Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. పెండింగ్ లో నిధులను విడుదల చేసింది. రేపో మాపో కూలీల బ్యాంకు అకౌంట్లలో నిధులు జమ కానున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ సెక్షనాఫ్ వర్గానికి ఇదొక శుభవార్త.


ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు చెప్పింది కూటమి సర్కార్. ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ నిధుల బిల్లుల చెల్లింపులు మొదలయ్యాయి. 528 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వారి వారి ఖాతాల్లో జమ చేసింది.

మిగతా రూ.178 కోట్లు నిధులను రేపో మాపో విడుదల చేయనుంది. 10 రోజుల్లో మిగిలిన మరో రూ.672 కోట్లు విడుదల కానున్నాయి. కేంద్రం నిధులు చెల్లింపులు ఆలస్యం చేయడంతో గతేడాది డిసెంబర్ నుంచి బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. కేంద్రంతో చంద్రబాబు సర్కార్ చర్చించిన తర్వాత రూ.900 కోట్లు నిధులు విడుదలయ్యాయి.


ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను కలిపి ప్రస్తుతం ఈ డబ్బులు చెల్లింపులు చేస్తోంది.2014-19లో టీడీపీ హయాంలో చేసిన పనుల బిల్లులను వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులను చెల్లిస్తోంది.

ALSO READ: జగన్ కి అదొక్కటే దిక్కా? పాదయాత్రపైనే భారమంతా

ప్రభుత్వ అధికార వర్గాల సమాచారం మేరకు మంగళవారం ఒక్కరోజు రూ.100 కోట్ల బిల్లులు చెల్లించారు. అలాగే గోకులాల పనులకు రూ.200 కోట్లు విడుదల చేశారు. వీటికితోడు రోడ్లు, కాలువల పనులకు మరో రూ.228 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించినట్లు వెల్లడించాయి. ఇదిలాఉండగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

ఏపీ వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొత్తగా 2,260 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనుంది. దీనికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర సంస్థ నిధుల నుంచి ఆయా వాహనాలను కోనుగోలు చేయనుంది. వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరణకు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది.

ప్రస్తుతం ఆ రుసుమును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. పాత వాహనాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. స్వచ్ఛాంధ్ర సంస్థ దీనికి సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. ఆయా సంస్థలతో మాట్లాడి తర్వాత ధరను నిర్ణయించనుంది.

Related News

Cyclone Alert: ఉత్తరాంధ్రను వణికించే న్యూస్.. రేపు మరింత డేంజర్?

Amaravati: వెల్కమ్ టు అమరావతి.. జగన్ కు టీడీపీ వెరైటీ ఛాలెంజ్

Rowdy Srikanth: నా భర్తది, శ్రీకాంత్‌ది సేమ్ ఉంటది.. అందుకే ఆస్పత్రిలో అలా చేశా

Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం?

Tirumala ghat road: శ్రీవారి దర్శనంతో పాటు ప్రకృతి సోయగం.. వర్షాలతో శోభిల్లుతున్న తిరుమల!

YS Jagan: జగన్ మద్దతు కోరిన బీజేపీ.. కాదని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా?

Big Stories

×