Nani : టాలీవుడ్ యంగ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఒకప్పుడు కూల్ బాయి లాగా లవ్ అండ్ ఎమోషనల్ మూవీ లతో ప్రేక్షకులను ఆదరించిన నాని ఈ మధ్య దసరా, హిట్ 3 వంటి చిత్రాలతో యాక్షన్ కోణాన్ని పరిచయం చేశాడు. సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు నాని. తాజాగా ఈయన లేటెస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
నాని లేటెస్ట్ లుక్ అదిరింది..
హీరో నాని సినిమా సినిమాకు తన లుక్ ను చేంజ్ చేస్తూ ఉంటాడు.. రీసెంట్ గా హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీలో మాస్ లుక్ లో నాని కనిపించాడు. అంతకు ముందు వచ్చిన దసరా మూవీలో గుబురు గడ్డం కర్లీ హెయిర్ తో కనిపించాడు. ఇప్పుడు తాజాగా నాని స్టైలిష్ లుక్ లో కనిపించాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో రింగుల జుట్టు కూలింగ్ గ్లాసెస్ పెట్టి చాలా స్టైల్ గా అందంగా ఉన్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసినా ఆయన అభిమానులు లుక్ మాత్రం అదిరిపోయింది బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు..
Also Read :ఇదేం ట్విస్ట్.. హిందీలో భారీ ధరకే శాటిలైట్ రైట్స్..!
నాని సినిమాల విషయానికొస్తే..
నాని బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు. గత ఏడాది హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఈ ఏడాది హిట్ 3 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా భారీ యాక్షన్ మోడ్లో వచ్చింది.. ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తున్న నాని నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఈ ఏడాది ఆయన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ వదిన దర్శకత్వంలో ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.. నాని ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసినట్లు సమాచారం..