OTT Movie : కొరియన్ సినిమాలకు ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అందుకు తగ్గట్టే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి. ఈరోజు నుంచి ఓటీటీలో ఒక యాక్షన్ సినిమా, స్టన్నింగ్ విజువల్స్ తో దద్దరిల్లిపోతోంది. సర్వైవల్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఇదొక మెమరబుల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. ఒక వంతెన మీద జరిగే యాక్షన్ సీన్స్ చూపుతిప్పుకోకుండా చేస్తున్నాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ప్రాజెక్ట్ సైలెన్స్’ (Project Silence) 2023లో విడుదలైన కొరియన్ థ్రిల్లర్ సినిమా. దీనికి కిమ్ తే-గోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లీ సన్-క్యున్ (చా జంగ్-వోన్), జూ జి-హూన్ (జో పార్క్), కిమ్ హీ-వోన్ (డాక్టర్ యాంగ్), కిమ్ సూ-ఆన్ (చా క్యుంగ్-మిన్) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 21న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిడ్‌నైట్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శించబడింది. భారతదేశంలో ఇది 2025 ఆగస్టు 1 నుంచి ఓటీటీప్లే, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్‌లతో అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 5.4/10 రేటింగ్ ఉంది
స్టోరీలోకి వెళితే
ఈ కథ ఇన్చియాన్ ఎయిర్‌పోర్ట్ బ్రిడ్జ్‌పై జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ ఒక ద్వీపాన్ని, కొరియన్ పెనిన్సులాలోని విమానాశ్రయాన్ని కలుపుతుంది. ఒక రోజు దట్టమైన పొగమంచు కారణంగా ఈ వంతెనపై ఏమి కనపడకుండా ఉంటుంది. దీనివల్ల చాలా వాహనాల ఢీకొనడంతో పేలుళ్ళు కూడా జరిగి వంతెన కూలిపోయే ప్రమాదంలో పడుతుంది. ఈ గందరగోళంలో వంతెనపై చిక్కుకున్న వాళ్ళల్లో చా జంగ్-వోన్ ఒక ప్రెసిడెన్షియల్ ఎయిడ్, తన కుమార్తె క్యుంగ్-మిన్ ను విమానాశ్రయంలో వదిలేందుకు వచ్చివుంటాడు. జో పార్క్ అనే ఒక టో ట్రక్ డ్రైవర్, విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తున్న ఒక వృద్ధ దంపతులు, డాక్టర్ యాంగ్ అనే సైనిక పరిశోధకుడు, వీళ్లంతా తమ ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. ఈ గందరగోళంలో “ప్రాజెక్ట్ సైలెన్స్” అనే రహస్య ప్రయోగంలో భాగంగా ఒక చోటికి తరలిస్తున్న కుక్కలు, వాటి బోనుల నుంచి బయటికి వస్తాయి. ఈ కుక్కలు మీద దక్షిణ కొరియా సైన్యం ప్రయోగాలు చేస్తుంటుంది. అమెరికా, యూరోపియన్ ప్రభుత్వాల మద్దతుతో, వీటిని ఉగ్రవాదులను టార్గెట్ చేసే కుక్కలుగా మార్చాలనుకుంటుంది.
Read Also : ఐఎండీబీలో 8.5 రేటింగ్… స్టార్ హీరో కాదు, రొమాన్స్ అంతకన్నా లేదు… ఓటీటీలో దంచికొడుతున్న వెబ్ సిరీస్
అయితే ఈ ప్రయోగం బెడిసికొడుతుంది. ఇప్పుడు ఈ కుక్కలు నియంత్రణ కోల్పోయి, వంతెనపై ఉన్న అందరినీ లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాయి. అక్కడ భయంకరమైన రక్తపాతం సృష్టిస్తాయి. సినిమా మొదటి 10 నిమిషాల నుంచే ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. వంతెన కూలిపోతున్న సన్నివేశాలు, హెలికాప్టర్ క్రాష్‌లు, కుక్కల దాడులతో ప్రేక్షకులను టెన్షన్ లో పెడుతుంది. క్లైమాక్స్‌లో జంగ్-వోన్, క్యుంగ్-మిన్ తమ ప్రాణాల కోసం చివరి పోరాటం చేస్తారు. వంతెన కూలిపోతున్న సమయంలో కుక్కలను ఎదిరించడానికి ఒక అదిరిపోయే ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ ఏమిటి ? ఈ కుక్కలనుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా ? వంతెన కూలిపోతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.