Brahmamudi serial today Episode: డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ టిఫిన్ చేస్తుంటే.. ఇంద్రాదేవి, రేవతి కొడుకు స్వరాజ్‌ను వాడు ఈ ఇంటి బిడ్డే కదా అంటుంది. ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు. వాడు ఈ ఇంటి బిడ్డేంటి అత్తయ్యా అని అపర్ణ అడుగుతుంది. దీంతో కావ్య ఏదో చెప్పి కవర్ చేస్తుంది. రుద్రాణి మాత్రం కావ్య మాటలు నమ్మదు. అమ్మ ఎందుకు వాడు ఈ ఇంటి బిడ్డ అంది అని ఆలోచిస్తుంది. ఇంద్రదేవి కోపంగా ఏంటి రుద్రాణి టిఫిన్ ఏమైనా నా ముఖంలో ఉందా..? అలా చూస్తున్నావు తిను అంటుంది. యా తింటున్న అంటుంది రుద్రాణి. ఇంతలో స్వరాజ్ తనకు దోశ కావాలంటాడు. సరేనని అపర్ణ దోశ తినిపిస్తుంది ఎలా ఉంది అని అడుగుతుంది. దీంతో నీలాగే సూపర్‌గా ఉంది ఫ్రెండు అంటాడు స్వరాజ్.
ఇంతలో ఇంద్రాదేవి ప్రేమగా అపర్ణ నువ్వలా వాడికి గోరు ముద్దులు తినిపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది. కానీ నాకు మాత్రం తనను చూస్తుంటే చాలా జాలేస్తుంది అంటుంది రుద్రాణి. అక్క మీద జాలేయడం ఏంటి రుద్రాణి అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. జాలి వేయక ఇంకేం వేస్తుంది రుద్రాణి. పాపం ఇంట్లో కోడలిని పెట్టుకుని కూడా ఇలా బయటి పిల్లల మీద ప్రేమ చూపిస్తే జాలి వేయక ఇంకేమనిపిస్తుంది. కన్నకూతురు ఎలాగూ ఇంటికి రాదు. కనీసం ఉన్న కొడుకు కోడలు అయినా సరిగ్గా ఉన్నారా అంటే అదీ లేదు. వేద మంత్రాల నడుమ తాళి కట్టించుకున్నా వెయ్యి మంది ముందు సప్తపది తొక్కినా ఏ ఉపయోగం లేకుండా పోయింది. తాళి కట్టిన వాడికి భార్య ఎవరో గుర్తు లేదు. తాళి కట్టించుకున్న కావ్యకు రాజే భర్త అని చెప్పే చాన్స్ లేదు. పాపం ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ వనవాసంలో తప్పిపోయిన ఆ సీతారాముళ్ల అయిపోయింది కావ్య, రాజ్ పరిస్థితి. ఇక వాళ్లిద్దరు ఒక్కటయ్యేది ఎప్పుడో వాళ్లకు పిల్లలు పుట్టోది ఎప్పుడో అని జాలి వేస్తుంది ధాన్యలక్ష్మీ అంటుంది రుద్రాణి. దీంతో ఇంద్రాదేవి, ప్రకాష్ ఇద్దరూ కలిసి రుద్రాణిని తిడతారు.
తరవాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా అప్పు వచ్చి బాబు వాళ్ల పేరెంట్స్ దొరికారంట అత్తయ్య గారు అని చెప్తుంది. రుద్రాణి షాక్ అవుతుంది. దొరికారా అంటే వాళ్లెవరో తెలిస్తే స్వరాజ్ ఎవరో తెలుసుకోవచ్చు అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. ఏంటి అప్పు నువ్వనేది అని అపర్ణ అడగ్గానే.. అవును ఆంటీ ఇందాకా స్టేసన్ నుంచి ఫోన్ చేశారు. బాబు కనిపించడం లేదని ఎవరో పేరెంట్స్ స్వరాజ్ ఫోటో చూపించి మిస్సింగ్ కాంప్లైంట్ ఇచ్చారట అని చెప్పగానే.. రుద్రాని లేచి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ల డీటెయిల్స్ కూడా కంప్లైంట్‌లో మెన్సన్ చేస్తారు కదా అని అడుగుతుంది. చేస్తారు రుద్రాణి గారు పేరెంట్స్ డీటెయిల్స్ లేకుండా బాబును ఎలా కన్‌ఫం చేస్తాం అంటూ అప్పు చెప్పగానే.. అవును అవును వీడికి వాళ్లు చెప్పినదానికి మాచ్ అవ్వాలి కదా..? ఇంతకీ వాళ్లు ఎవరట.? వాళ్ల పేరేంటి..? అని రుద్రాణి అడగ్గానే.. ఇప్పుడు వాళ్ల పేరెందుకు రుద్రాణి బాబు పేరెంట్స్ అని చెప్తుంది కదా..? అంటుంది ఇంద్రాదేవి. ఇప్పుడు వాళ్లెవరో వచ్చి మావాడే అంటే ఇచ్చేస్తామా..? రేపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు రెస్పాన్స్‌బిలిటీ ఏంటి అప్పు వాళ్ల పేర్లు ఏంటి చెప్పు పేర్లు చెప్పడానికి ఎందుకు అంత సంకోచిస్తున్నావు అంటే వీడు నిజంగానే బయటి వాడు కాదా ఏంటి..? అని అడుగుతుంది.
ఇంతలో ధాన్యలక్ష్మీ కూడా ఏంటి అప్పు వాళ్ల పేర్లు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు బాబు పేరెంట్స్ ఎవరో చెప్పు.. అనగానే.. ఆలోచనేం లేదు అత్తయ్యా వాళ్ల పేర్లు సడన్‌గా స్ర్కైక్ కావడం లేదు ఆ గుర్తొచ్చింది బాబు వాళ్లు పేరెంట్స్ పేర్లు లక్ష్మీ రాకేష్ అంట.. అత్తయ్యగారు నేను స్టేషన్ కు వెళ్లినప్పుడు బాబును తీసుకెళ్తాను రెడీ చేసి ఉంచండి అంటుంది అప్పు. వీణ్ని నువ్వు తీసుకెళ్లడం ఏంటి వాళ్లనే ఇక్కడికి రమ్మను అంటుంది. దీంతో కావ్య, అప్పు రుద్రాణిని తిట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం అంతా జరుగుతుంది అని చెప్తారు. ఇంతలో అపర్ణ వీడిని నేను నీతో పంపించను.. కావాలంటే నేను కూడా నీతో పాటు స్టేషన్‌కు వస్తాను. లేదంటే వాళ్లకు పేరెంట్స్‌కు ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతే పంపిస్తాను. అనగానే అప్పు, రేవతికి ఫోన్ చేసి ఇవ్వగానే అపర్ణ మాట్లాడుతుంది. తర్వాత బాబును పంపిస్తాను అని చెప్తుంది. రుద్రాణి అనుమానంగా వీడికి ఈ ఇంటికి ఏదో రిలేషన్ ఉన్నట్టు ఉంది. ఓరేయ్ రాహుల్ నువ్వు అప్పును ఫాలో అవ్వు వాడెవడో తెలుసుకో అని చెప్తుంది.
తర్వాత కాయ దేవుడి ముందు నిలబడి మొక్కుతుంటే వాంటింగ్స్ చేసుకుంటుంది. డౌట్ వచ్చి ప్రెగ్నెసీ టెస్ట్ చేసుకుంటే అందులో పాజిటివ్ వస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం