BigTV English
Advertisement

Most Watched Movies 2024 : నెట్ ఫ్లిక్స్ లో కాసుల వర్షం కురిపించిన టాలీవుడ్ మూవీస్..

Most Watched Movies 2024 : నెట్ ఫ్లిక్స్ లో కాసుల వర్షం కురిపించిన టాలీవుడ్ మూవీస్..

Most Watched Movies 2024: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది భారీగా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాలు కాస్త ఎక్కువగానే హిట్ టాక్ అందుకున్నాయి. థియేటర్లలో కలెక్షన్ల సునామి సృష్టించిన సినిమాలు అటు ఓటీటిలో కూడా దుమ్ము దులిపేసాయి. భారీ వ్యూస్ తో అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.. అందులో అన్ని స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం.. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులో ఓటీటీలోకి తీసుకొస్తున్నాయి. ఈ మధ్య హారర్ యాక్షన్ సినిమాలతో పాటుగా పాన్ ఇండియా హీరోల సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వచ్చింది. ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన హిట్ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

సరిపోదా శనివారం.. 


దసరా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి నానితో జత కట్టింది ప్రియాంక అరుళ్ మోహన్.. ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. థియేటర్లలోనే కాదు. నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి టాక్ ను అందుకుంది.

టిల్లు స్క్వేర్.. 

టాలీవుడ్ యూత్ ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డీజే టిల్లు కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్ లా వచ్చిన అవైటెడ్ చిత్రమే టిల్లు స్క్వేర్. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. 125 కోట్ల గ్రాస్ ను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చి మంచి వ్యూస్ ను రాబట్టింది.

దేవర.. 

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర.. కొరటాల శివ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చాయని తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. భారీ వ్యూస్ ను అందుకుంది. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది..

లక్కీ భాస్కర్.. 

మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అటు ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది ఈ సినిమా. కాగా ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా భారీగా వ్యూస్ ను అందుకుంది.

వీటితో పాటుగా ‘మత్తువదలరా 2’ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కావడం ఈ ఓటిటికు చేసిన మేలు అంతా ఇంతా కాదు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, రవితేజ మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా స్మార్ట్ స్క్రీన్ పై ఆదరణ దక్కించుకున్నాయి.. ఇక లేటెస్ట్ గా ‘పుష్ప 2 ది రూల్’ దీని ఖాతాలోనే ఉంది. భారీ మొత్తానికి హక్కులు కొన్నారు.. థియేటర్లలో ప్రభంజనాన్ని సృష్టిస్తున్న ఈ మూవీ అప్పుడే 900 కోట్ల గ్రాస్ ను అందుకుంది.. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×