E-Paper
Advertisement

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే
Advertisement

Spanish Crime Thriller Series: అసాధారణమైన తెలివితేటలు ఉన్న డిటెక్టివ్‌.. చిక్కుముడిలా మారిపోయిన హత్యలు, కిడ్నాప్‌ కేసులు.. వాటి వెనుక దాగి ఉన్న క్రూరమైన నేరగాళ్లు. ఇలాంటి హై-ప్రొఫైల్‌ ఇన్వెస్టిగేషన్‌ కథలకు ఓటీటీలో మంచి క్రేజ్‌ ఉంటుంది. స్పానిష్‌ రచయిత జువాన్‌ గోమెజ్‌-జురాడో రాసిన బెస్ట్‌ సెల్లింగ్‌ నవల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘Red Queen’ (Reina Roja) కూడా అలాంటి ఆసక్తికరమైన కథతోనే వచ్చింది. అమెజాన్ స్టూడియోస్ అత్యంత భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించిన ఈ హై-వోల్టేజ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో అఫీషియల్ గా ల్యాండ్ అయిపోయింది. 242 ఐక్యూ ఉన్న ఆంటోనియా స్కాట్‌ అనే మహిళ చుట్టూ తిరిగే ఈ సిరీస్‌ లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. అంతటి తెలివితేటలు ఉన్న మహిళ ఒక క్లిష్టమైన హత్య, కిడ్నాప్‌ కేసును ఎలా ఛేదించిందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ అంతా ఆంటోనియా స్కాట్ అనే ఒక విచిత్రమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు ఎలాంటి సూపర్ పవర్స్ ఉండవు కానీ, ఆమె మైండ్ పవర్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఎంటిటీ. ఆమెకు ఏకంగా 242 ఐక్యూ (IQ) ఉంటుంది. అంటే భూమిపై ఉన్న అత్యంత తెలివైన సామాన్య మనిషి కంటే ఆమె మెదడు చాలా రెట్లు వేగంగా ఆలోచిస్తుంది. ఈ అసాధారణ ఇంటెలిజెన్స్ వల్లే ఆమె యూరోపియన్ పోలీస్ ఆర్గనైజేషన్ లో అత్యంత సీక్రెట్ ఇన్వెస్టిగేటివ్ ప్రాజెక్ట్ ‘రెడ్ క్వీన్’ గా మారుతుంది. కట్ చేస్తే.. ఒకరోజు ఒక బడా కోటీశ్వరుడి కొడుకు దారుణంగా హత్యకు గురవుతాడు, అలాగే స్పానిష్ లోనే మోస్ట్ పవర్‌ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు కిడ్నాప్ అవుతుంది.

Advertisement

ఈ కేసును గుట్టుచప్పుడు కాకుండా సాల్వ్ చేయడానికి ఆంటోనియా రంగంలోకి దిగుతుంది. ఆమెకు తోడుగా ఒక గంభీరమైన పోలీస్ ఆఫీసర్ గ్యుటెర్రెజ్ అటాచ్ అవుతాడు. ఆ 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్ క్రైమ్ సీన్ లోని చిన్న చిన్న క్లూస్ ని ఆధారంగా చేసుకుని మైండ్ లోనే ఆ మర్డర్ ని రీ-క్రియేట్ చేసే సీన్స్ ఆడియన్స్ కి ప్రాపర్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. విలన్లు వేసే మైండ్ గేమ్స్ ని, సైకో కిల్లర్ల ప్లాన్స్ ని ఆమె తన ఇంటెలిజెన్స్ తో ఎలా తిప్పికొట్టింది, క్రిమినల్స్ కు ఎలా దబిడి దిబిడే అనిపించింది అనేది చాలా స్టైలిష్ గా డైరెక్ట్ చేశారు. ప్రతీ సీన్ లో వచ్చే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఒక మంచి హై-లెవెల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చూడాలనుకుంటే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్  

ఆంటోనియా స్కాట్‌ పాత్రలో విక్టోరియా లుయెంగో, జోన్‌ గుటియెరెజ్‌ పాత్రలో హోవిక్‌ క్యుచ్కెరియన్‌ నటించారు. ఈ సిరీస్‌కు కోల్డో సెర్రా, జూలియన్‌ డి తవీరా దర్శకత్వం వహించారు. 2024 ఫిబ్రవరి 29న రిలీజ్ అయింది. రెండో సీజన్ 2026 అక్టోబర్ 2,న విడుదల అయింది. ఈ సీజన్‌లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం Amazon Prime Videoలో స్పానిష్‌ ఒరిజినల్‌ ఆడియోతో పాటు పలు భాషల ఆడియో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది తెలుగు డబ్బింగ్‌ లో అందుబాటులో లేదు.

Advertisement

Read Also: లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

Related News

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

కొడుకు వింతగా ప్రవర్తిస్తున్నాడని టీచర్‌పై అనుమానం… స్కూలుకెళ్ళి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉన్న మిస్టరీ డ్రామా

రాణి శరీరంలోకి మగ చెఫ్‌ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

ఉదయం కాలేజ్ క్లాసెస్, రాత్రి డార్క్ బిజినెస్… ఈ డ్యూయల్ లైఫ్ గేమ్ నెక్స్ట్ లెవెల్ మావా

Big Stories

Advertisement
×