BigTV English
Advertisement

Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!

Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!

Earthquake Strikes Kamchatka:

రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున  కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో కూడిన బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో  ద్వీపకల్పం అంతటా షాక్‌ వేవ్‌ లు విస్తరించాయి. ప్రస్తుత పరిస్థితిలో తీర ప్రాంతంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రగర్భంలో దాదాపు 10–20 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం రష్యా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:37 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం రష్యాలోని దూర ప్రాంతం అయిన ఆఫ్‌ షోర్‌ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడికానప్పటికీ, స్థానిక అధికారులు ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేశారు.


కమ్చట్కా భూకంప కేంద్ర స్థానం

నిజానికి కమ్చట్కాలో భూకంపాలు కొత్తేమీ కాదు. ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉత్తర కొన దగ్గర ఉంది. ఇది తరచుగా భూకంపాలు, విస్ఫోటనాలు సంభవించే అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి చెందింది.  పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టే విశాలమైన గుర్రపునాడా ఆకారపు జోన్. కమ్చట్కాలో 1952తో పాటు జూలై 2025లో శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వీటి ధాటికి ఈ ద్వీపకల్పంలో ఎన్నో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఇక్కడ ఏర్పడిన భూకంపాలు  పసిఫిక్ రీజియన్ అంతటా సునామీ హెచ్చరికలకు కారణం అయ్యాయి. .

కమ్చట్కాలో ఎందుకు భూకంపాలు వస్తాయి?

కమ్చట్కా అనేది చురుకైన టెక్టోనిక్ బార్డర్. కురిల్- కమ్చట్కా ట్రెంచ్ పైన దాని స్థానం ఉంటుంది.  ఇక్కడ, భారీ పసిఫిక్ ప్లేట్ సబ్‌ డక్షన్ అనే ప్రక్రియలో భాగంగా మైక్రో ప్లేట్లు నిరంతరం కదులుతాయి. ఇక్కడి భూగర్భంలోని పలకాలు సంవత్సరానికి 86 మిల్లీ మీటర్ల వేగంతో కదులుతాయి. ఇది భూమికి సంబంధించి అత్యంత వేగంగా కదిలే సబ్‌ డక్షన్ జోన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.  కాలక్రమేణా, భూగర్భంలో ఉన్న మెగాథ్రస్ట్ ఫాల్ట్ వెంట ఒత్తిడి  పెరుగుతోంది. దీని కారణంగా అప్పుడప్పుడు తీవ్రమైన శక్తితో పెద్ద భూకంపాలు ఏర్పడుతున్నాయి. ఈ టెక్టోనిక్ బ్యాలెట్ ద్వీపకల్పం అంతటా వందకు పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఇక్కడి భూగర్భం నుంచే లావా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.


భూ ఉపరితం క్రింద ఏం జరుగుతుంది?  

కమ్చట్కా భూ ఉపరితం క్రింద, పసిఫిక్ ప్లేట్ భూమి మాంటిల్‌ లోకి దాదాపు 10 కిలో మీటర్లు దిగుతోంది. ఇది కిందికి పడిపోతున్నప్పుడు ఘర్షణ కారణంగా అపారమైన ఒత్తిడిని ఏర్పరుస్తాయి. ఇది చివరికి ఆకస్మిక, వినాశకరమైన భూకంపాలకు కారణం అవుతుంది. ఇక్కడి భూగర్భంలోని వేడి మాంటిల్ పదార్థం అగ్నిపర్వత కార్యకలాపాల పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. కమ్చట్కా కింద ప్లేట్ బార్డర్లు స్థిరమైన గ్రైండింగ్, కదలిక భూకంప ప్రమాదాల ముప్పును పెంచుతుంది.

Read Also: ముందు ఎయిర్ ఎయిర్ ఇండియా, తర్వాత ఇండిగో.. నేపాల్ మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభం!

Related News

Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్‌.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్

US Nuclear Weapons: 33 ఏళ్ల తర్వాత అణ్వాయుధాలను బయటకు తీస్తున్న ట్రంప్ మామ.. ఎందుకంటే?

Trump Xi Jinping Meeting: జిన్ పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ.. టారిఫ్ లపై చైనాకు భారీ ఊరట

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

Amazon layoffs: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 30 వేల మందిపై వేటు? మేనేజర్లకు ఈ-మెయిల్స్

Explosion in America: అమెరికాలో భారీ పేలుడు..16 మంది దుర్మరణం

Diwali Celebrations Canada: కెనడాలో దీపావళి వేడుకలు.. 2 ఇళ్లను తగలబెట్టేసిన భారతీయులు!

Big Stories

×