OTT Movies : మార్చి నెల నేటితో పూర్తయిపోతుంది. రేపటి నుంచి ఏప్రిల్ నెల మొదలవుతుంది. ఏప్రిల్లో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ నెలలో దాదాపు 19 సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు పోటీ పడుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నవి ఉన్నాయి. ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతున్నావ్ ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న శారీ సినిమా నుంచి 30 తారీఖు రిలీజ్ అవుతున్న భద్రకాళి సినిమా వరకు ప్రతి సినిమా కూడా భారీ హైప్ ను క్రియేట్ ఛేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటిటీలో కూడా కొత్త సినిమాలు కొన్ని రిలీజ్ అయిపోతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. మొదటివారం ఓటిటిలో కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో, ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కొత్త నెల వచ్చింది అంటే సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే థియేటర్స్‌లో లూసిఫర్, మ్యాడ్, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి.. ఇంకో వారం పాటు బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాల హవా ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్స్‌లోకి వచ్చే పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు. ప్రస్తుతం స్టూడెంట్స్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బయట ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక అలాంటివారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు డేట్ ని లాక్ ఛేసుకున్నాయి. ఇందులో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలను చూస్తే..
జియో హాట్‌స్టార్
జ్యూరర్ 2 (ఇంగ్లీష్/తెలుగు) ఏప్రిల్ 1
హైపర్ నైఫ్ (కొరియన్/ తెలుగు) వెబ్ సిరీస్ ఏప్రిల్ 2
ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 3
టచ్ మీ నాట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
జీ5..
కింగ్స్‌స్టన్ (తెలుగు/తమిళ్)- ఏప్రిల్ 4
ఆహా..
హోం టౌన్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
నెట్‌ఫ్లిక్స్..
టెస్ట్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 4
కర్మ కొరియన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 4
అమెజాన్ ప్రైమ్..
బ్లాక్ బ్యాగ్- ఏప్రిల్ 1
అక్టోబర్ 8- ఏప్రిల్1
ది బాండ్స్‌మ్యాన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 3
ఈవారం మొత్తం కలిపి సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి 11 వరకు రిలీజ్ అవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త తక్కువ సినిమాలో రిలీజ్ అవుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెలలో ఓటిటిలో కంటే థియేటర్లో సినిమాలు, ఎక్కువగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ తక్కువగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఏప్రిల్ తో పాటు మే నెలలో బోలెడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో స్టార్ హీరోలు నటించిన సినిమాలే ఎక్కువగా ఉండడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తామని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ స్టూడెంట్స్ కి సరికొత్త అనుభూతినిచ్చేలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా అని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలలో ఎప్పుడు కొత్త సినిమాలకు కేరాఫ్ గా మారుతాయి. ఇక ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో? అందులోంచి కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే అంచనాలను పెంచేసుకున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. ఇక కొత్త డేట్ ఎప్పుడో చూడాలి..