Thriller Movie In OTT : ఇటీవల ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చినప్పుడు ఎలాంటి క్రేజ్ ను అందుకున్నాయో అంతకు మించి ఇక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. అయితే హారర్ థ్రిల్లర్ మూవీస్ కు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య ఓటీటీలోకి కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా ఓటీటీలోకి స్ట్రీమింగ్ వస్తున్నాయి. ఆ సినిమాలకు డిమాండ్ ఎలా ఉంటుందో ఆ వ్యూస్ ను బట్టి చూస్తున్నాం.. తాజాగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఇదొక హాలీవుడ్ మూవీ.. ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో ఒక్కసారి చూద్దాం..
హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హారర్ సినిమాలు ఎక్కువగా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. తెలుగులోకి డబ్ చేస్తున్న సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్: రొములస్. ఆగస్ట్ 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.. ఈ మూవీ ఏలియన్ ఫ్రాంఛైజీలోవచ్చింది. ఈ సినిమా 1979లో వచ్చిన ఏలియన్, 1986లో వచ్చిన ఏలియన్స్ మూవీ వచ్చింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఏలియన్: రొములస్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ అయ్యింది. అప్పటిలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
గతంలో వచ్చిన సినిమా కన్నా ఈ సినిమా భారీ క్రేజ్ తో పాటుగా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. తక్కువ బడ్జెట్ లో తెరకేక్కిన కూడా ఏకంగా 35 కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఓ పాడుబడిన స్పేస్ స్టేషన్ నుంచి తమకు పనికి వచ్చే వస్తువులను సేకరిస్తున్న సమయంలో విశ్వంలోని ఏలియన్స్ ఓ వింత జీవి రూపంలో వచ్చి వాళ్లపై దాడిచేస్తుంది. ఆ ఏలీయాన్ నుంచి ఎలా తపప్పించుకుంటారు అన్నది స్టోరీ. మనుషులకు ఎలియన్స్ మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ప్రతి సీన్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ కాలనిస్ట్స్ తప్పించుకున్నారా లేదా అన్నదే ఈ ఏలియన్: రొములస్ మూవీ. ఏలియన్ ఫ్రాంఛైజీల్లో ని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ ఎలియన్ మూవీ నిలిచింది. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందుకే ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య వరుస సినిమాలు ఓటీటీ లో సందడి చేస్తున్నాయి.
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి నేటి నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో రావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.3 వేల కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి ఓటీటీలో కూడా మంచి ఆదరణ దక్కుతుంది. ప్రస్తుతం ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.