Amitabh Bachchan.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan ) భారతదేశం గర్వించదగ్గ స్టార్ గా ఎదిగారు. వర్సటైల్ యాక్టర్ గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు బిగ్ బీ . అయితే ఈయన కుటుంబం పై మనసును కలిచి వేసే వార్తలు నిరంతరం రాస్తూ.. వారి కుటుంబన్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు తమ కుటుంబంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ఒక్కసారిగా మండిపడ్డారు బిగ్ బీ.
గత కొన్ని రోజులుగా తన కొడుకు, కోడలు విడిపోతున్నారంటూ కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్న హిందీ మీడియాపై మండిపడ్డారు అమితాబ్ బచ్చన్. ముఖ్యంగా తన కొడుకు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) కోడలు ఐశ్వర్యరాయ్(ఐశ్ విడిపోతున్నారంటూ హిందీ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిని మొదటిసారి ఖండించారు. ఇవన్నీ వాస్తవం కాదు అంటూ తెలిపారు. అయినా సరే ఈ కుటుంబం పై వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.నిజానికి ఈ పుకార్లు రావడానికి కారణం అభిషేక్ బచ్చన్ ,ఐశ్వర్య రాయ్ బచ్చన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల జరిగిన అంబానీ ఇంట వివాహానికి వచ్చినప్పుడు వీరిద్దరూ విడివిడిగా కనిపించారు.
అయితే బచ్చన్ కుటుంబం అన్ని ఊహాజనిత కథనాలపై గౌరవప్రదమైన మౌనాన్ని కొనసాగించింది. కానీ అమితాబచ్చన్ చివరికి తన తాజా బ్లాగ్ పోస్ట్ లో నిగూఢంగా అభిప్రాయాలను వ్యక్తపరిస్తూ.. అన్నింటినీ ప్రస్తావించారు. ఈ మేరకు ఒక సుదీర్ఘమైన నోట్ కూడా వదిలారు. ఊహాగానాల వెనుక ఉన్న నిజం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. నేను కుటుంబం గురించి చాలా అరుదుగానే మాట్లాడుతాను. ఎందుకంటే అది నా డొమైన్. ముఖ్యంగా కుటుంబం యొక్క గోప్యతను నేను కాపాడే ప్రయత్నం చేస్తాను. అవన్నీ ధ్రువీకరణ లేకుండా ఊహాజనిత అవాస్తవాలు మాత్రమే అంటూ తెలిపారు.
మీడియా వృత్తికి సంబంధించిన వారి వ్యాపారం ఎంపిక చేసుకున్న వృత్తిలో ఉండాలనే వారి కోరికను నేను సవాలు చేయను. సమాజానికి సేవ చేయడంలో వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తాను. కానీ అవాస్తవాలు లేదా అనుమానాలు, ఊహాజనిత వార్తలు సరికాదు అంటూ తెలిపారు. అంతేకాదు అనుమానం అనే విత్తనం నాటకూడదు అని ,పాఠకులు దానిని విశ్లేషించాలని.. ఏదైనా సరే నిజం తెలుసుకున్న తర్వాతనే వార్తలు రాయాలని కోరారు అమితాబ్ బచ్చన్. ముఖ్యంగా ఏదైనా సరే క్వశ్చన్ మార్క్ ని ఉపయోగించి రాయడాన్ని అవహేళన చేశారు. ఇలాంటి ప్రచారం చేసే వారికి మనసాక్షి ఉంటుందా అంటూ తెలిపారు. మొత్తానికి అయితే తమ కొడుకు కోడలు విడాకుల వార్తలపై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు అమితాబ్ బచ్చన్.
ఇకపోతే ఈయన నటిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.” ఐ వాంట్ టు టాక్” చిత్రం నవంబర్ 22వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, లుక్స్ అన్నీ కూడా అమితాబ్ పై ప్రశంసలు కురిపించేలా చేశాయి. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.