OTT Movies : ప్రతి వారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు స్టార్ హీరోల సినిమాలు అయితే, మరికొన్ని డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి.. థియేటర్లలో విడుదలైన ప్రతి మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తుంది.. సినిమా థియేటర్లలో సక్సెస్ టాక్ ను అందుకుంటే స్ట్రీమింగ్ ఆలస్యంగా వస్తాయి. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటే అలాంటి సినిమాలు మాత్రం వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తాయి. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు చూస్తే కుబేర, ‘8 వసంతాలు’ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఆమిర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘సితారే జమీన్ పర్’ కూడా ఈ వీకెండ్‌లోనే బిగ్ స్క్రీన్‌పై సందడి చెయ్యనున్నాయి. అటు ఓటీటీల్లోకి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో కూడా ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.. నేరుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు అయితే లేవు. ఇంతకీ ఈ వీక్ ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు ఇవే..
జియో హాట్ స్టార్..
సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జూన్ 18
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 20
ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 20
నెట్‌ఫ్లిక్స్..
జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 17
కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) – జూన్ 17
ట్రైన్ రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 17
అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 18
రోషారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ సిరీస్) – జూన్ 18
సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 18
యోలాంతే (డచ్ సిరీస్) – జూన్ 18
ద వాటర్ ఫ్రంట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 19
కే-పాప్: ద డీమన్ హంటర్స్ (కొరియన్ సినిమా) – జూన్ 20
గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 20
ఒలింపో (స్పానిష్ సిరీస్) – జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 20
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (హిందీ కామెడీ షో) – జూన్ 21
అమెజాన్ ప్రైమ్..
గ్రౌండ్ జీరో (హిందీ సినిమా) – జూన్ 20 (రెగ్యులర్ స్ట్రీమింగ్)
సన్ నెక్స్ట్..
జిన్: ద పెట్ (తమిళ సినిమా) – జూన్ 20
ఆపిల్ ప్లస్ టీవీ..
ద బుకనీర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 18
లయన్స్ గేట్ ప్లే..
కాబోల్ (ఫ్రెంచ్ సిరీస్) – జూన్ 20
ప్రతి వారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఈ వారం ఈ సినిమాలు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకు డేట్ ను లాక్ చేసుకున్న సినిమాలు కొన్ని అయితే.. మధ్యలో కొన్ని మూవీస్ డేట్ ను లాక్ చేసుకుంటున్నాయి. ఓటీటీల్లోకి ఈ వారం పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు రాలేదు. థియేటర్లలోకి కొత్త సినిమాల సందడి చేస్తున్నాయి. ఏ మూవీకి ఎలా రిజల్ట్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి..