Kannappa First Review : మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప(Kannappa) అనే ఆధ్యాత్మిక చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మంచు విష్ణు ఈ సినిమాని పలువురు సినీ సెలబ్రిటీలకు ప్రత్యేక షోలు వేయించి చూయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు కూడా ఈ సినిమాని చూయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ ఈ సినిమాకు తన రివ్యూ ఇచ్చినట్లు మంచి విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
హగ్ చేసుకున్న రజనీకాంత్…
ఈ సందర్భంగా మంచు విష్ణు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ…”నిన్న రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప సినిమాని చూశారని విష్ణు తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను గట్టిగా హగ్ చేసుకుని కన్నప్ప సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఒక నటుడిగా గత 22 సంవత్సరాలుగా రజనీకాంత్ గారి నుంచి కౌగిలింత, ఈ ప్రశంసల కోసం ఎదురుచూస్తున్నానని, ఆయన ప్రశంసలు నన్ను ఎంతగానో ప్రోత్సహించాయని విష్ణు తెలిపారు. కన్నప్ప సినిమా జూన్ 27వ తేదీ రాబోతోంది. ఈ ప్రపంచం ఆశివుని మాయను అనుభూతి పొందే వరకు నేను ఎదురు చూడలేక పోతున్నాను.. హర హర మహాదేవ”అంటూ విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
కన్నప్ప పై పెరుగుతున్న అంచనాలు…
ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కన్నప్ప సినిమా చూసి అద్భుతంగా ఉంది అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో మంచు విష్ణు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలా పలువురు సినీ సెలబ్రిటీలకు ఈయన కన్నప్ప సినిమా చూపిస్తున్నారని అయితే అందరి నుంచి చాలా మంచి పాజిటివ్ రివ్యూ రావడంతో కన్నప్ప టీం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై మంచి అంచనాలనే పెంచేసింది.
https://twiter.com/iVishnuManchu/status/1934554394500161618
ఇక ఈ సినిమా ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి వారందరూ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ నటుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు నిర్మాణ సంస్థలో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మంచు విష్ణు కెరియర్ కు ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. మరి కన్నప్ప సినిమా మంచు విష్ణుకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.