Camel viral video: తెలుగు రాష్ట్రాల్లో ఒంటెలు పెద్దగా కనిపించవు. సాధారణంగా ఒంటెలు జూ పార్కుల్లో.. ఏడారి ప్రాంతాల్లో చూస్తుంటాం. అలాగే టీవీల్లో, సోషల్ మీడియాలో ఒంటెల వీడియోలు చాలా చూశాంటాం. నేరుగా చూడడం మనం చాలా తక్కువ. ఒకవేళ మనకు రోడ్ల మీద ఒంటెలు కనిపిస్తే.. అలా ఆగి కాసేపు చూస్తుంటాం. ఎందుకంటే మనకు అవి రేర్ గా కనిపించే జీవులు. అయితే తాజాగా.. ఒంటెలు హైదరాబాద్ గల్లీల్లో, ప్రధాన రోడ్లపై కనిపిస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఒంటెపై కూర్చొని నిద్రపోయి తూలుతూ.. సవారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కుర్రాడు ఒంటెపై సవారీ చేస్తూ కనిపించాడు. అయితే వీడియోలో ఆ యువకుడు మద్యం సేవించినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులోనే ప్రమాదకరంగా ఒంటెపై సవారీ చేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒంటె ఫ్లైఓవర్ పై స్పీడుగా పరిగెత్తుతోంది. పెంచి పోషించుకున్న ఒంటెపై నమ్మకం అనుకున్నాడు ఏమో కానీ.. ఫుల్ గా తాగి.. ఒంటెపై సవారీ చేశాడు ఆ యువకుడు. కొంచెం మిస్ అయిన ఫ్లైవర్ నుంచి కిందపడే వాడు. దీంతో వాహనదారులు కొంత ఆందోళనకు గురయ్యారు. ప్లైఓవర్ నుంచి మద్యం మత్తులో ఉన్న యువకుడు కింద పడితే.. ప్రాణాలకే ప్రమాదమని అనుకున్నారు. అలాగే ఒంటె వాహనాలకు అడ్డు వచ్చినా.. పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
Sir A Very Sorry to Saying this
This Video got from a Well Known Reporter Abu Aimal bhai. In Video Guy who is Owner of that Camel and what his Business it's Secondary Sir.But this is Not the Gud Behaviour.I Say Give a little punishment to him,So Next time he won't Do this. pic.twitter.com/yvWeRkccce
— Mohammed Mohsin (@MOHSINPTC_BRS) June 15, 2025
అయితే.. ఫ్లైఓవర్ పై కారులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు ఆ షాకింగ్ సీన్ ను ఫోన్ లో రికార్డు చేశారు. ఆ వీడియోలో ఒంటెను ఆపేందుకు వాహనదారులు ప్రయత్నించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. పరిస్థితిని చక్కదిద్దడానికి.. నెమ్మదిగా ఆ ఒంటెను దాని మెడలో ఉన్న తాడుతో ఫ్లైఓవర్ పైనున్న స్థంబానికి కట్టేశారు. ఈ వీడియోను వాహనదారుడు ఇన్ స్టాగ్రామ్, ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ALSO READ: Tractor Viral Video: అది మంచం అనుకున్నావా? హైవేపై ట్రాక్టర్‌పై పడుకొని డ్రైవింగ్.. మన స్టేట్‌లోనే!
అయితే, సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ‘తాగిన మైకంలో ఒంటెపై అంత స్పీడుతో ఎలాంటి భయం, బెరుకు లేకుండా సవారీ చేస్తున్నావ్.. నువ్వు గ్రేట్ బ్రో’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు ‘కొంచెం మిస్ అయినా ఫ్లై ఓవర్ నుంచి కిందపడితే ప్రాణాలకే ప్రమాదం.. లక్కీగా బతికేశావ్’ అని కామెంట్ చేసుకోచ్చాడు. ‘వాహనాదారులు మంచి పని చేశారు.. లేకుంటే తాగిన మైకంలో ఉన్న యువకుడికి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు’ అని మరొక వ్యక్తి కామెంట్ చేశాడు.