IndiGo Fuel: ఇప్పటికే విమాన టికెట్ల ధరలు మండిపోతున్నాయి.ఇకపై మరింత భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. IndiGo ఫ్యూయల్ సర్‌చార్జ్ పెంచింది. మరి ఇతర ఎయిర్‌లైన్స్ కూడా అదే బాటలో నడుస్తాయా?. అసలు విమాన టికెట్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?. ప్రయాణికుడి జేబుకు ఎంత చిల్లు పడనుంది?
1300 అదనపు భారం..
దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ IndiGo డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను పెంచింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ATF ధరలు పెరగడం వల్లే నిర్వహణ ఖర్చు భారం కావడం వల్లే ఈ నిర్ణయమని ప్రకటించింది.దూరాన్ని బట్టి దేశీయ ప్రయాణాలపై రూ.375 నుంచి రూ.1,300 వరకు అదనపు ఫ్యూయల్ సర్‌చార్జ్ వసూలు చేస్తారు. 500 కిమీ వరకు 375, ఆపై వెయ్యి కిమీలకు 600, 1500 కిమీ 1150 ,2వేల కిమీపైగా దూరానికి 1300 అదనపు భారం తప్పదిక.
ATF ధరలు..
ఇటీవల ATF ధరలు 14 శాతానికి పైగా పెరిగాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ATF ధరలు మండిపోతున్నాయి.అందుకు కారణం పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు. ఇంధన ధరల పెరుగుదలతో ఆపరేటింగ్ ఖర్చులపై ఒత్తిడి పెరిగింది. అందుకే ఫ్యూయల్ ఛార్జీలను స్వల్పంగా సవరించామంటోంది ఇండిగో.. టికెట్ ధర అనేది కేవలం బేస్ ఫేర్‌తో ఆగిపోదు. ఫ్యూయల్ ధరలు డిమాండ్ సీట్ల లభ్యత పండుగలు, సెలవుల సీజన్ ఇవన్నీ కలిసి టికెట్ ధరను నిర్ణయిస్తాయి.అందుకే రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే విమాన ప్రయాణం మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.
రేపోమాపో..
ATF ధరలు పెరిగితే విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. అందుకే ఫ్యూయల్ సర్‌చార్జ్ సవరణ సాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు ఇండిగో ఇక నెక్ట్స్ మిగతా ఎయిర్ లైన్స్ కూడా ఛార్జీలు పెంచుతాయా? ప్రస్తుతానికి అధికారికంగా అలాంటి ప్రకటనలేవి రాలేదు కానీ రేపోమాపో మిగతా సంస్థలు కూడా ఇండిగో బాటలో చార్జీలు పెంచనూ వచ్చనే చర్చ జరుగుతోంది. ATF ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే ఇతర సంస్థలపైనా ఛార్జీలు పెంచే ఒత్తిడి తప్పక వుంటుందంటున్నారు నిపుణులు.
Tags

Share