E-Paper
Advertisement

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!
Advertisement

Peddireddy Case: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. దేవాదాయ, ధర్మాదాయ ట్రిబ్యునల్‌కు వెళ్లాల్సిందేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జస్టిస్ విశ్వనాథన్, జస్టిన్ అరుణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇష్టానుసారంగా రోడ్లు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని అటవీ భూములను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారన్న ఆరోపణలు, ఫిర్యాదులున్నాయి. ప్రధానంగా తన కుటుంబ సంస్థ పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు లబ్ధి చేకూర్చేందుకు రక్షిత అటవీ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రోడ్లు వేయించి బిల్లులు చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈమేరకు ఏప్రిల్ 11న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ భూములతో తనకు సంబంధం లేదని, తన సోదరుడు ద్వారకానాథరెడ్డి ఈ భూములను కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు మే 3న సర్వే ప్రారంభించారు. సర్వే ప్రారంభించిన వెంటనే, భూముల అనుభవదారులు వెంకట్రాయులు మరియు మునిరత్నం కుటుంబ సభ్యులు అధికారులను అడ్డుకున్నారు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని నియంత్రించారు. అధికారులు, పోలీసుల సమక్షంలోనే సర్వే కొనసాగింది. అనంతరం భూములను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, పదిరోజుల్లో ఖాళీ చేయాలంటూ… మఠం ఈవో ఉత్తర్వులిచ్చారు.

సింగిల్‌ బెంచ్ స్పష్టం..

Advertisement

బుగ్గమఠం ఈవో ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ పెద్దిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈవో ఉత్తర్వులపై అభ్యంతరాలను నాలుగు వారాల్లోగా దేవాదాయ, ధర్మాదాయ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకోవాలని సింగిల్‌ బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై డివిజన్ బెంచ్‌కు వెళ్లగా సింగిల్ బెంచ్ ఇచ్చిన నాలుగు వారాల గడువును మరో నాలుగు వారాలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. దీంతో పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా అత్యున్నత న్యాయస్థానంలోనూ పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బే తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది.

Also read: వర్కింగ్ వీసాలపై అమెరికా మరో బిగ్ వార్నింగ్.. H-1B వీసాలను రద్దు..?

Tags

Related News

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర రైల్వే స్టేషన్.. అయోమయంలో ప్రయాణికులు!

తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు.. శివకార్తికేయన్ సమావేశం వెనుక వ్యూహం ఇదేనా?

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

Big Stories

Advertisement
×