Horror Movie OTT : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి వచ్చేస్తాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతూ మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంటాయి. ఈమధ్య హారర్ సినిమాలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తాయి.. దాంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈమధ్య హారర్ సినిమాలు పాతవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అదేగా మరో దయ్యం సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో?ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
ఇదొక తమిళ హారర్ సినిమా.. ముర్‌ముర్ ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ తో పాటు టెంట్ కోట ద్వారా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతుంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ముర్‌ముర్ ఓటీటీలోకి రావడం గమనార్హం.. ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ముర్‌ముర్ థియేటర్లలో ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కోట్లు రావటం కూడా సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లలో దూసుకుపోతుంది..
స్టోరీ విషయానికొస్తే..
మెల్విన్, రిషి, అంకిత, జెనిఫర్ యూట్యూబర్లు. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంటారు. అడవి మధ్యలో ఉన్న సప్త కన్నిగల్ అనే ప్రాంతాన్ని ఒక దెయ్యం పట్టి పీడిస్తుంది. నిజానికి అక్కడ దెయ్యాలు లేవు అని నిరూపించడానికి కొందరు ఆ అడవి ప్రాంతంలోకి వెళ్తారు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? నలుగురు స్నేహితులు అదృశ్యం కావడానికి కారణం ఏమిటి? వారి కెమెరాలలోరికార్డ్ అయిన వీడియోల ద్వారా ఈ ప్రాంతం గురించి ఎలాంటి నిజాలు బయట పడ్డాయి. అనేది ఈ మూవీ స్టోరీ.. ఇకపోతే ఫౌండ్‌ఫుటేజ్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా ముర్‌ముర్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు హేమంత్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ద్వారా పలువురు కొత్త యాక్టర్స్ కోలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు సీనియర్ నటులు నటించారు. థియేటర్లలో పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ ఇక ఓటిటి లో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ కొత్త, పాత సినిమాలు ఏవైనా ఇక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తమిళ మూవీలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.