OTT Movie : ఓటిటిలో సూపర్ నాచురల్ పవర్ తో బీభత్సం చేసే సినిమాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలలో మనిషికి ఉండే అతీతమైన శక్తులతో మూవీ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇటువంటి సినిమాలను ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక వ్యక్తికి ఆత్మలకు చూడగలిగే శక్తి ఉంటుంది. వాటితో ఇతను మాట్లాడగలడు కూడా. ఈ పవర్ తో స్టోరీ రసవతరంగా ఉంటుంది. ఈ డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సూపర్‌నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు’ఒడ్ థామస్’ (Odd Thomas). 2013 లో విడుదలైన ఈ అమెరికన్ మిస్టరీ త్రిల్లర్ మూవీకి స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వం వహించారు. ఇది డీన్ కూంట్జ్ అనే రచయిత రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఆంటన్ యెల్చిన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒడ్ థామస్ అనే యువకుడు కాలిఫోర్నియాలోని ఒక చిన్న పట్టణం నివసిస్తుంటాడు. అతను ఒక సాధారణ కుక్‌గా పనిచేస్తాడు. అయితే అతనికి ఒక అసాధారణ సామర్థ్యం ఉంటుంది. చనిపోయిన వారి ఆత్మలను చూడగలడం, వారితో మాట్లాడగలగడం వంటి శక్తి ఉంటుంది. ఈ శక్తి వల్ల అతను తన పట్టణంలో జరిగే అన్యాయాలను సరిచేయడానికి, హత్యలను పరిష్కరించడానికి ఒక పోలీస్ అధికారికి సహాయం చేస్తాడు. అతని స్నేహితురాలు స్టార్మీ,స్థానిక పోలీసు చీఫ్ వైట్ పోర్టర్ కు తప్ప ఈ రహస్యాన్ని అతడు ఎవరికీ చెప్పడు. స్టార్మీని ఒడ్ ఇష్టపడుతుంటాడు. ఒక రోజు ఒడ్ ఒక వింతైన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. అతన్ని ఫంగస్ మాన్ అని పిలుస్తారు. ఈ వ్యక్తి చుట్టూ బోడాచ్‌లు అనే నీడలాంటి జీవులు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా పెద్ద ఎత్తున మరణాలు జరగబోతున్నప్పుడు కనిపిస్తాయని ఒడ్‌కి తెలుస్తుంది. అతని దగ్గర ఈ బోడాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల, ఒడ్‌కి ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అనిపిస్తుంది.
తన దర్యాప్తులో ఒడ్ ఈ ఫంగస్ మాన్ ఒక భయంకరమైన కుట్రలో భాగమని తెలుసుకుంటాడు. అతను స్టార్మీ, చీఫ్ పోర్టర్, ఇతర స్నేహితుల సహాయంతో ఈ కుట్రను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక షాపింగ్ మాల్‌లో జరగబోయే భారీ విధ్వంసం గురించి తెలుస్తుంది. ఫంగస్ మాన్ ఈ కుట్రకు మూల వ్యక్తి గా ఉంటాడు. దీని వెనుక ఒక పెద్ద సైతాన్ సమూహం ఉందని ఒడ్ కనుగొంటాడు. అతను ఈ విపత్తును నివారించడానికి, తన వంతు ప్రయత్నం చేయడం మొదలుపెడతాడు. కానీ ఈ క్రమంలో స్టార్మీ చనిపోతుందని ఒడ్ తెలుసుకుంటాడు. ఆమె ఆత్మ అతనితో వీడ్కోలు చెప్పి, అతన్ని ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది. చివరికి ఒడ్ ఈ విధ్వంసాన్ని ఆపడంలో విజయం సాధిస్తాడా ? ఆ సైతాన్ సమూహాన్ని ఒడ్ ఎలా ఎదుర్కుంటాడు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.