OTT Movie : కామెడీ కాన్సెప్ట్ తో వచ్చే హారర్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మూవీ లవర్స్. ఈ కంటెంట్ తో వచ్చిన సినిమాలు, ఇదివరకే మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అయితే 2024 లో వచ్చిన థాయిలాండ్ హారర్ కామెడీ మూవీ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ కామెడీ హారర్ మూవీ పేరు ‘మై బూ‘ (My Boo). ఈ మూవీలో తాత వారసత్వంగా వచ్చిన ఒక ఇంటిని, ఘోస్ట్ హౌస్ గా తయారుచేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు హీరో. అందులో నిజంగానే దయ్యాలు కూడా ఉంటాయి. ఆ ఇంట్లో జరిగే కామెడీ సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తాతగారు బాగా సంపాదించి చనిపోతూ, అందరికీ తన ఆస్తిని వీలునామా రాస్తాడు. అయితే హీరోకి మాత్రం ఏమీ రాయకుండా, కనీసం అతని పేరుని కూడా వీలునామాలో రాయకపోవడంతో హీరో బాధపడతాడు. అప్పుడు అక్కడే ఉన్న తన కజిన్, తన ఇంటిని నీకు ఇస్తాను అని చెప్పి హీరోకి పేపర్లు కూడా ఇస్తాడు. సంతోషం పట్టలేక ఆ ఇంటికి వెళ్ళి చూడగా, అది ఒక పెద్ద బూతు బంగ్లా మాదిరి ఉంటుంది. దానిని రిపేర్ చేయించి, ఎక్కువ డబ్బుకు అమ్ముకోవాలని అనుకుంటాడు హీరో. బ్యాంకు లోన్ తీసుకొని ఆ ఇంటిని బాగా రిపేర్ చేస్తాడు. ఆ ఇంటిని చూపించడానికి ఒక పార్టీని తీసుకువస్తాడు హీరో. అయితే అందులో ఉన్న దయ్యాలను చూసి ఆవ్యక్తి పారిపోతాడు. హీరో ఆదయ్యాలను చూసి, ఇది నా ఇల్లు, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు. అయితే ఆ దయ్యం ఇది కూడా నా ఇల్లే అంటూ చెబుతుంది. వాళ్లు భయంకరమైన ఆకారాలతో కాకుండా, మనుషులు మాదిరిగానే కనబడుతూ ఉంటారు. హీరో ఆ ఇంటి గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు.
ఆ ఇంట్లో ఇద్దరు పనివాళ్ళకు ఒక అమ్మాయిని అప్పగించి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు హనీమూన్ కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి, కూతురు పనివాళ్ళు కనిపించకుండా పోతారు. ఆ తల్లిదండ్రులు కొంతకాలం వెతికి, మళ్లీ హనీమూన్ కి వెళ్ళిపోతూ చనిపోతారు. ఈ విషయం కూతురు దయ్యానికి చెప్తాడు హీరో. అయితే అతనికి ఇంతలోనే ఒక ఉపాయం వస్తుంది. ఈ ఇంటిని హంటెడ్ హౌస్ గా మార్చి, డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఇంతలో ఆ దయ్యాలకు ఉన్న పవర్స్ ని కూడా తెలుసుకుంటాడు. ఇలా ఆడ దయ్యం తో ప్రేమలో పడతాడు హీరో. చివరికి హీరో ఆ ఇంటిని ఘోస్ట్ హౌస్ గా చేస్తాడా? ఆ దయ్యంతో ప్రేమ ఎంతవరకు వెళుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘మై బూ’ (My Boo) కామెడీ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి.