OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ నే ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే వీటిలో ఎన్నో సినిమాలు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు మంచి మెసేజ్ తో పాటు, కొంతలో కొంతైనా మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటాయి. అటువంటి ఫీల్ గుడ్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ది ప్రొఫెసర్‘ (The Professor). ఈ మూవీకి వేన్ రాబర్ట్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జానీ డెప్, రోజ్‌మేరీ డివిట్, డానీ హస్టన్, జోయ్ డ్యూచ్, రాన్ లివింగ్‌స్టన్, ఒడెస్సా యంగ్ నటించారు. ఆరు నెలలలో చనిపోతానని తెలుసుకున్న ఒక ప్రొఫెసర్, ఆ తర్వాత తన జీవితాన్ని ఎలా కంటిన్యూ చేశాడనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ప్రొఫెసర్ గా ఉంటూ, పిల్లలకు టీచింగ్ చెప్తూ ఉంటాడు. అయితే ఇతనికి క్యాన్సర్ ఉందని, ఆరు నెలలకు మించి బ్రతకమని డాక్టర్లు చెబుతారు. తను ఎక్కువ కాలం బ్రతకడని చాలా బాధపడతాడు హీరో. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి భార్య, కూతురికి అసలు విషయం చెప్తాడు. నా దగ్గర దాచిన విషయాలు ఏమన్నా ఉంటే చెప్పమని అడుగుతాడు. అందుకు భార్య, మీ కాలేజ్ చైర్మన్ తో రిలేషన్ లో ఉన్నానని చెబుతుంది. ఈ విషయం తెలిసి హీరో చాలా బాధపడతాడు. అయినా తనకు సర్ది చెప్పుకొని, కూతుర్ని కూడా అడుగుతాడు. అయితే కూతురు నేను ఒక లెస్బియన్ అని, ఒక అమ్మాయి తో రిలేషన్ లో ఉన్నానని చెప్తుంది. నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉండమని కూతురితో చెప్తాడు హీరో. ఇన్ని రోజులు భార్య పిల్లలకు కోసం ఆలోచించిన నేను, ఈ ఆరు నెలలు తనకోసం బతకాలని నిర్ణయించుకుంటాడు. సిగరెట్ కూడా అలవాటు లేని ఇతడు, సిగరెట్ తో పాటు మందు కూడా తాగుతూ ఉంటాడు.
కాలేజ్ లో పిల్లలకు పాఠాలు చెబుతూ, నా క్లాస్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లిపోమని చెప్తాడు. అందులో సగం మంది వెళ్ళిపోతారు. మిగతా సగం మందితో పార్టీ చేసుకుంటూ, మీకు నచ్చినట్టు మీరు గడపండి అని చెప్తాడు. ఎప్పటికీ ఎథిక్స్ తో బతకమని అందరికీ చెప్తాడు. నేను చనిపోతానని తెలిసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది నువ్వు, కూతురు మాత్రమే అని భార్యకి చెప్తాడు. డబ్బు కూడా లేనందున మీరు ఎలా బతుకుతారని ఆలోచించాను. అయితే నువ్వు మా చైర్మన్ తోనే రిలేషన్ పెట్టుకున్నావు. అతడు చాలా మంచివాడు. నేను చనిపోతే నిన్ను మంచిగా చూసుకుంటాడు. ఇక్కడ చనిపోయి నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. నేను వేరొక చోటికి వెళ్లి చనిపోతాను అంటూ, అక్కడి నుంచి బయలుదేరుతాడు. చివరికి హీరో క్యాన్సర్ తో చనిపోతాడా? భార్య, పిల్లల పరిస్థితి ఏమవుతుంది? చావును అంత తేలిగ్గా తీసుకున్న ప్రొఫెసర్, చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ది ప్రొఫెసర్'(The Professor) మూవీని మిస్ కాకుండా చూడండి.