OTT Movie : యూత్ ని ఆకట్టుకునే లవ్ ట్రాక్, ఉత్కంఠ భరిత యాక్షన్ సన్నివేశాలతో ఒక హాలీవుడ్ మూవీ ప్రేక్షకుల మతి పోగొడుతోంది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని, ఓటీటీలో కూడా టాప్ లేపుతోంది. ఇది ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది.
ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఈ స్పానిష్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మై ఫాల్ట్’ (My Fault). 2023లో రిలీజ్ అయిన ఈ సినిమాకి గొంజాలెజ్ దర్శకత్వం వహించారు. ఇందులో నికోల్ వాలెస్, గాబ్రియెల్ గుయేవారా ప్రధాన పాత్రలలో నటించారు. ఇది మెర్సిడెస్ రాన్ రాసిన వాట్‌ప్యాడ్ కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం 2023 జూన్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదలైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ హిస్టరీలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా రికార్డ్ సాధించింది. 1 గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ చిత్రం 17 ఏళ్ల నోహా మోర్గాన్ (నికోల్ వాలెస్) చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తన బాయ్‌ఫ్రెండ్, స్నేహితులను వదిలి, తన తల్లి రఫాయెలా (మార్తా హజాస్) కొత్తగా వివాహం చేసుకున్న బిలియనీర్ విలియం లీస్టర్ (ఇవాన్ సాంచెజ్) లగ్జరీ మాన్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఈ కొత్త జీవితానికి నోహా వ్యతిరేకంగా ఉంటుంది. ఆమె తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో, ఈ గ్లామరస్ ప్రపంచంలో సర్దుకోవడానికి ఇష్టపడదు. అక్కడ ఆమె తన కొత్త సవతి సోదరుడు నిక్ లీస్టర్ (గాబ్రియెల్ గుయేవారా)ను కలుస్తుంది. అతనికి అందంతో పాటు, అహంకారం కూడా ఉంటుంది. ఇతను స్ట్రీట్ రేసింగ్, గ్యాంబ్లింగ్, రోడ్ సైడ్ ఫైటింగ్‌లలో పాల్గొంటాడు. నోహా ఈ లైఫ్ స్టైల్ కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.
నోహా, నిక్ బలమైన వ్యక్తిత్వాలు మొదట్లో గొడవలకు దారితీస్తాయి. కానీ వారి మధ్య ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. ఇది సీక్రెట్ సంబంధంగా మారుతుంది. వీళ్ళ ప్రేమను, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అదే సమయంలో, నోహా తన గతంలోని ఒక బాధాకరమైన సంఘటనను ఎదుర్కొంటుంది. చనిపోయాడనుకున్న ఆమె తండ్రి జోనాస్ బతికే ఉంటాడు. ప్రతీకారం కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. సమయంలో నోహాను జోనాస్ కిడ్నాప్ చేస్తాడు. అంతేకాకుండా విలియం నుండి డబ్బు డిమాండ్ చేస్తాడు. ఇది ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌కు దారితీస్తుంది. ఒక హై-స్పీడ్ చేజ్‌లో, ఇది ఒక యాక్షన్ సినిమా తీసినట్లుగా ఉంటుంది. ఈ హై-ఆక్టేన్ సన్నివేశంతో స్టోరీ ఎండ్ అవుతుంది. జోనాస్ నుండి నోహా బయట పడుతుందా ? నోహా, నిక్ లవ్ ట్రాక్ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే , ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : లైవ్ లో దొంగతనం… నరాలు తెగే సస్పెన్స్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే హీస్ట్ థ్రిల్లర్