BigTV English

OTT Movie : లైవ్ లో దొంగతనం… నరాలు తెగే సస్పెన్స్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : లైవ్ లో దొంగతనం… నరాలు తెగే సస్పెన్స్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. దొరికిన సమయంలో నచ్చిన సినిమాను చూసుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే ఒక హీస్ట్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ఇది మ్యాజిక్ ట్రిక్స్, సస్పెన్స్, ఊహించని ట్విస్ట్‌లతో నడుస్తుంది. దీనిని థ్రిల్లర్ అభిమానులు తప్పక చూడవలసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘నౌ యూ సీ మీ’ (Now You See Me) 2013 లో లూయిస్ లెటెరియర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక అమెరికన్ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో జెస్సీ ఐసెన్‌బర్గ్, మార్క్ రుఫలో, వుడీ హారెల్సన్, ఇస్లా ఫిషర్, డేవ్ ఫ్రాంకో, మెలానీ లారెంట్, మోర్గాన్ ఫ్రీమాన్ నటించారు. ఈ చిత్రం ఒక గ్రిప్పింగ్, ఫాస్ట్-పేస్డ్ కథనం. ఇందులో ఇల్యూషనిస్టుల బృందం అసాధారణ బ్యాంక్ దోపిడీలను చేస్తూ, అధికారులను ఆశ్చర్యపరిచే మాయాజాల ట్రిక్ లను ప్రదర్శిస్తుంటారు. ఈ సినిమాలో వచ్చే స్మార్ట్ ట్విస్ట్‌లు, ఆకర్షణీయమైన కథకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 351 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 1 గంట 55 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.2/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ చిత్రం జె. డేనియల్ అట్లాస్, మెరిట్ మెక్‌కిన్నీ,హెన్లీ రీవ్స్, జాక్ వైల్డర్ అనే నలుగురు ప్రతిభావంతమైన స్ట్రీట్ మాజిషియన్లతో ప్రారంభమవుతుంది. వీళ్ళను ఒక వ్యక్తి రహస్యంగా కలిసి ‘ది ఫోర్ హార్స్‌మెన్’ అనే బృందంగా ఏర్పాటు చేస్తాడు. వీళ్ళు ఒక రహస్యమైన హుడెడ్ ఫిగర్ నుండి తారో కార్డుల ద్వారా సందేశాలు అందుకుంటారు. లాస్ వెగాస్‌లో ఒక భారీ మ్యాజిక్ షో కోసం వీళ్ళకు ఆహ్వానం అందుతుంది. మొదటి ప్రదర్శనలో, ఫోర్ హార్స్‌మెన్ ఒక ఫ్రెంచ్ బ్యాంక్ వాల్ట్ నుండి $3.2 మిలియన్లను “టెలిపోర్ట్” చేస్తూ, ఆ డబ్బును ప్రేక్షకుల మధ్య పంచిపెడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ దోపిడీ నిజమైనదని తేలడంతో, FBI ఏజెంట్ డైలాన్ రోడ్స్, ఇంటర్‌పోల్ ఏజెంట్ ఆల్మా డ్రే వారిని అరెస్టు చేయడానికి దర్యాప్తు ప్రారంభిస్తారు.

అయితే హార్స్‌మెన్ మాయాజాల చర్యలు, వారిని పట్టుకోవడం దాదాపు అసాధ్యం చేస్తాయి. హార్స్‌మెన్ తమ రెండవ షోలో న్యూ ఓర్లీన్స్‌లో ఒక అవినీతి వ్యాపారవేత్త అర్థర్ ట్రెస్లర్ బ్యాంక్ ఖాతా నుండి $140 మిలియన్లను దొంగిలించి, అతని బీమా స్కామ్ బాధితులకు పంచిపెడతారు. ఈ సమయంలో థడియస్ బ్రాడ్లీ అనే ఒక మాజీ మాజిషియన్, ఈ మ్యాజిక్ ట్రిక్‌లను FBIకి వివరించడానికి సహాయం చేస్తాడు. కానీ హార్స్‌మెన్ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుంటారు. డైలాన్, ఆల్మా వీళ్ళ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఆల్మా “ది ఐ” అనే మాజిషియన్ల గురించి తెలుసుకుంటుంది. వీళ్ళు న్యాయం కోసం మ్యాజిక్ ట్రిక్స్ ను ఉపయోగిస్తారని తెలుసుకుంటుంది. ఇక న్యూయార్క్ సిటీలో జరిగే చివరి షోలో, హార్స్‌మెన్ భారీ మొత్తంలో డబ్బును దొంగిలించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్లైమాక్స్ ఊహించని మలుపులతో ముందుకు సాగుతుంది. ఇంతకీ ఈ హార్స్‌మెన్ లక్ష్యాలు ఏమిటి ? FBIకి వీళ్ళు దొరుకుతారా ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హీస్ట్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : రాత్రికి రాత్రే ఇంటి చుట్టూ వెలిసే బద్దలు కొట్టలేని గోడలు… గుండెల్లో గుబులు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : మనుషుల్ని వెంటాడి చంపే నీడ… పిచ్చెక్కించే ట్విస్టులు… మతిపోయే మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×