E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ
Advertisement

Romantic Drama : పెద్దలకు మాత్రమే అనే లైన్ కనబడగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. పైగా సీక్రెట్ గా అలాంటి సినిమాలు చూడాలనే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అయితే ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఇలాంటి ఆడియన్స్ కోసమే అన్నట్టుగా కొన్ని బోల్డ్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. అందులో ‘మై ఫాల్ట్: లండన్’ (My Fault: London) కూడా ఒకటి. 2025లో వచ్చిన ఇంటెన్స్ లవ్ రొమాంటిక్ డ్రామా ఇది. ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న హై-ఎమోషన్, హై-స్పీడ్ ప్రేమ కథ. ఆశా బ్యాంక్స్, మాథ్యూ బ్రూమ్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ హైలైట్. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

నోవా (ఆశా బ్యాంక్స్) 18 ఏళ్ల అమ్మాయి. స్వతంత్ర స్వభావం గల అమెరికన్ టీనేజ్ గర్ల్. ఆమె తల్లి ఎల్లా లండన్‌ కు చెందిన అత్యంత ధనవంతుడు, పవర్‌ఫుల్ బిజినెస్ టైకూన్ విలియమ్ ను వివాహం చేసుకుంటుంది. దీంతో నోవా జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అమెరికాలో తన స్నేహితులు, బాయ్‌ఫ్రెండ్, స్వేచ్ఛగా గడిపే రోజులను వదిలేసి… లండన్‌ లోని విలియం సొంతం చేసుకున్న భారీ, విలాసవంతమైన ప్యాలెస్‌కు మారాల్సి వస్తుంది. కొత్త ఇల్లు, కొత్త నగరం, కొత్త కుటుంబం అన్నీ నోవాకు కొత్తగా ఉంటాయి.

Advertisement

అక్కడ ఆమెకు పరిచయమయ్యే వ్యక్తి నిక్ (మాథ్యూ బ్రూమ్). అతనెవరో కాదు ఆమె తల్లి కొత్తగా పెళ్లి చేసుకున్న విలియం కుమారుడు, అంటే నోవా సవతి తల్లి కొడుకు, అన్న వరుస అవుతాడన్నమాట. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడని తెలుస్తుంది. చాలా పర్ఫెక్ట్, కూల్, ఇంటెలిజెంట్ అబ్బాయిలా కనిపిస్తాడు. కానీ రాత్రి వేళల్లో అతను పూర్తిగా మారిపోతాడు. అండర్‌గ్రౌండ్ కార్ రేసింగ్, వైల్డ్ పార్టీలు, డ్రగ్స్, గొడవలు… ఇదే అతని బ్యాడ్ బాయ్ రియాలిటీ.

నోవా – నిక్ మధ్య మొదట్లో తీవ్రమైన శత్రుత్వం ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇబ్బంది పెట్టడం, విమర్శించడం, తిరస్కరించడం కొనసాగుతుంది. కానీ ఓరోజు రాత్రి నోవా రహస్యంగా నిక్ వెళ్తున్న అండర్‌గ్రౌండ్ రేసింగ్ పార్టీకి వెళ్తుంది. అక్కడ రౌడీలు నోవాను టార్గెట్ చేసినప్పుడు నిక్ ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత జరిగిన రేసులో నోవా తన డ్రైవింగ్ స్కిల్స్‌ తో నిక్‌ ను ఆశ్చర్యపరుస్తుంది.ఈ సంఘటనలు వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వాన్ని నెమ్మదిగా ఆకర్షణగా, తర్వాత సన్నిహితంగా అయ్యేలా మారుస్తాయి. తాము వరుసకు అన్నా చెల్లెళ్లము అని తెలిసినా, వారు తమ భావాలను అదుపు చేసుకోలేక రహస్య సంబంధం ప్రారంభిస్తారు.

Advertisement

సీక్రెట్ గా కలుసుకోవడం, రాత్రి వేళల్లో సీక్రెట్ డేట్స్, ఎమోషనల్ కనెక్షన్… ఇలా వారి ప్రేమ రోజురోజుకూ ఎక్కువవుతూ ఉంటుంది. అయితే నిక్‌కు పాత శత్రువులు ఉంటారు. ఒక వైపు వారు నోవాను టార్గెట్ చేస్తే, మరోవైపు నోవా చిన్నతనంలో తన కన్న తండ్రి వల్ల ఎదుర్కొన్న భయంకరమైన ట్రామా ఆమెను వెంటాడుతుంది. జైలు నుంచి విడుదలైన ఆ తండ్రి డబ్బు, పగ కోసం లండన్ వచ్చి, నిక్ శత్రువులతో చేతులు కలుపుతాడు. తండ్రి, అతని గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలిసిన నిక్ తన జీవితాన్ని పణంగా పెట్టి నోవాను ఎలా కాపాడాడు ? అతని తండ్రిని ఏం చేశారు ? నిక్-నోవా మధ్య ఉన్న సంబంధం వారి తల్లిదండ్రులకు తెలిశాక ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ? అనేది తెలియాలంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే. ‘మై ఫాల్ట్: లండన్’ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

Read Also : ప్రతి ఎపిసోడ్ 9.7 రేటింగ్… విజయం సాధించడానికి చెల్లించాల్సిన భారీ మూల్యం

Related News

జాకీ చాన్ – జాన్ సెనా కలిసి నటించిన నాన్ స్టాప్ యాక్షన్ రైడ్… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్

డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో

చేతబడులు, క్షుద్రపూజలు తిప్పి కొడితే ? కొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హర్రర్, థ్రిల్లర్!

శోభనం తర్వాత రోజే భార్య పంచాయతీ… కితకితలు పెట్టే కామెడీ ఫ్యామిలీ డ్రామా

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్

Big Stories

×