E-Paper
Advertisement

దక్షిణాదిలో కొత్త ఒరవడి.. ఒకే వేదికపైకి సీఎంలు చంద్రబాబు-రేవంత్- డీకే శివకుమార్‌

దక్షిణాదిలో కొత్త ఒరవడి.. ఒకే వేదికపైకి సీఎంలు చంద్రబాబు-రేవంత్- డీకే శివకుమార్‌
Advertisement

Tungabhadra Project: దక్షిణాది రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలైందా? కేసీఆర్ ప్రారంభించి రాజకీయ సంస్కృతి కంటిన్యూ అవుతుందా? ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రానున్నారా? తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైందా? గురువారం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుందా?

కర్ణాటకలో గురువారం అదురైన ఘట్టం

Advertisement

గురువారం ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కనిపించబోతున్నారు. జూన్ 25న కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం స్పిల్‌వే గేట్లు ఓపెన్ కానున్నాయి. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్‌లతోపాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ హాజరుకానున్నారు.

గురువారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్‌ పాటిల్- సీఎం డీకే శివకుమార్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ప్రాజెక్ట్ 33 గేట్లను ఓపెన్ చేయనున్నారు. గేట్ల ప్రారంభోత్సవం తర్వాత మునిరాబాద్‌ వద్ద బహిరంగ సభకు వీరంతా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానాలు ఇచ్చారు.

Advertisement

ఒకే వేదికపైకి సీఎంలు చంద్రబాబు-రేవంత్- డీకే శివకుమార్‌

ఇక సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి కర్నూలు వెళ్తున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. గురువారం ఉదయం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటకలోని కొప్పళ జిల్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తుంగభద్ర ప్రాజెక్టు దగ్గరకు వెళ్తారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తోరణగల్లు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తుంగభద్ర ప్రాజెక్టు దగ్గరకు వెళ్లనున్నారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు కీలకమైన ప్రాజెక్టు తుంగభద్ర. ఏడాది కిందట ప్రాజెక్ట్ 19వ గేటు కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా గేటును బిగించారు. నిపుణుల సూచనలతో 33 పాత క్రస్ట్‌ గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తికావడంతో గురువారం అంటే జూన్ 25న ప్రారంభించనున్నారు.

ALSO READ: అసెంబ్లీలో సీఎం విజయ్ ఊహించని ప్రవర్తన.. స్టాలిన్‌ను అనుకరిస్తూ, చేతిని అలా చూపిస్తూ..

తుంగభద్ర ప్రాజెక్ట్ పరిధిలోకి కర్ణాటక- 9 లక్షల ఎకరాలు, ఏపీలో 7 లక్షల ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాల సాగు, తాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు నిర్మించి దాదాపు ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఒకే వేదికపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంల రావడంపై బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు.

దక్షిణాది ఈ తరహా ఒరవడికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ సమయంలో ఆనాటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్,ఏపీ సీఎం జగన్‌లను కేసీఆర్ ఆహ్వానించిన విషయం తెల్సిందే. తమ నేత దక్షిణాదిలో ప్రారంభించిన ఈ ఒరవడి, కంటిన్యూ అవుతుందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆనాడు ప్రాజెక్టుల విషయంలో ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై వచ్చారని గుర్తు చేస్తున్నారు.

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×