E-Paper
Advertisement

Mythological Thriller OTT : స్టార్ హీరో – రొమాన్స్ – యాక్షన్ లేవు… 40 కోట్లు పెడితే 326 కోట్లు సంపాదించి పూనకాలు తెప్పించిన మూవీ

Mythological Thriller OTT : స్టార్ హీరో – రొమాన్స్ – యాక్షన్ లేవు… 40 కోట్లు పెడితే 326 కోట్లు సంపాదించి పూనకాలు తెప్పించిన మూవీ
Advertisement

Mythological Thriller OTT : 2025లో ఎన్నో బిగ్ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినా, స్టార్ హీరోలు లేకుండా వచ్చిన ఒక యానిమేటెడ్ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సుమారు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 326 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓటీటీలోనూ దుమ్ము రేపింది ఈ మూవీ. స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన ఆ యానిమేటెడ్ మూవీ ఏంటో, ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పటిదాకా సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన యానిమేటెడ్ ‘మహావతార్ నరసింహ’. జూలై 25న రిలీజ్ అయిన ఈ చిత్రం పూర్తిగా 3D యానిమేషన్‌లో రూపొందింది. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. విష్ణు పురాణం, నరసింహ పురాణం, శ్రీమద్ భాగవతం నుండి ఇన్స్పైర్ అయిన స్టోరీతో విజువల్ వండర్ గా తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒకేసారి ఈ మూవీ రిలీజ్ అయింది. థియేటర్లలో 50 రోజులు దూసుకుపోయి, ఇండియన్ యానిమేటెడ్ మూవీస్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. IMDbలో మంచి రేటింగ్ ఉంది. అలాగే క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.

Advertisement

థియేటర్లలో భారీ సక్సెస్ అందుకున్న తర్వాత సెప్టెంబర్ 19 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు సహా అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్ లోకి వెళ్ళి దుమ్మురేపింది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ఫస్ట్ పార్ట్ ఇది. తదుపరి భాగాలు కూడా వస్తున్నాయి. డివోషనల్, మైథలాజికల్ స్టోరీస్ ఇష్టపడేవాళ్లకి, ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్ మూవీ. విజువల్స్, మ్యూజిక్ అద్భుతం. ఇంకా చూడకపోతే, ఒకవేళ చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే మూవీ కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ.

Read Also :  డేంజర్లో పడేసే అన్ ఎక్స్పక్టెడ్ కాల్… పీడకలలాంటి జర్నీ… సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు అదిరే ట్రీట్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

మహా విష్ణువు నాలుగో అవతారం నరసింహుడి చుట్టూ తిరిగే మైథలాజికల్ ఎపిక్ స్టోరీ ఇది. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు రాక్షస జాతికి చెందినవాడు, అతని తండ్రి, రాక్షస రాజు హిరణ్యకశిపుడు. విష్ణువును ఎవ్వరూ పూజించకూడదు అని రూల్ పెడతాడు. ఎవరైనా అలా చేస్తే ఘోరమైన శిక్షలు విధించి చంపేస్తాడు. కానీ అతని కొడుకే స్వయంగా శ్రీ మహావిష్ణువు భక్తుడు. విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు పద్ధతి మార్చుకోమని కొడుకుకు వార్నింగ్ ఇస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం తండ్రికే మహా విష్ణువు మహత్యం గురించి చెబుతాడు. ఇక విసిగి పోయిన ఆ రాక్షస రాజు సొంత కొడుకు అని కూడా చూడకుండా చిత్రహింసలు పెడతాడు. తరువాత ఏమైంది అన్నది స్టోరీ. ఈ క్లాసిక్ స్టోరీని అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. వరాహ అవతారం కూడా కవర్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్ బ్యాలెన్స్‌డ్ గా ఉంటాయి. స్టార్ కాస్ట్ లేకుండా, ప్రమోషన్స్ కూడా మినిమల్‌గా ఉన్నా వర్డ్ ఆఫ్ మౌత్‌తో దూసుకుపోయింది. ఇండియాలో 249 కోట్లు, గ్లోబల్‌గా 326 కోట్లు కలెక్ట్ చేసింది. 2025లో టాప్ గ్రాసర్స్‌లో ఆరో స్థానం, ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీకి మైలురాయి అయింది ఈ మూవీ.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×